పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనత.. ఫ్యాన్స్ కు ఇంతకంటే ఇంకేం కావాలి?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరు హీరోలతో పోల్చి చూస్తే తీసింది తక్కువ సినిమాలే. అయినా ఆయనకు మిగతా హీరోలతో పోల్చి చూస్తే కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యారు. 2007లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొని ముందుకు సాగారు. ఈ క్రమంలోనే ఎన్ని ఆటుపోట్లు ఎదురైన ప్రజల తరఫున నిలబడి పోరాట చేశారు.

 ఇక అతని ఎజెండాకు ఫిదా అయిపోయిన ఏపీ ప్రజలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండమైన విజయాన్ని అందించారు. ఏకంగా పోటీ చేసిన 21 చోట్ల కూడా అటు జనసేన పార్టీ ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అభిమానులందరూ కూడా ఆయనని ఒక రేంజ్ లో ట్రెండు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడమే కాదు డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలను చేపట్టారు పవన్ కళ్యాణ్. దీంతో సీఎం తర్వాత సీఎం అంతటి స్థాయిలో ఆయన కొనసాగుతున్నారు అని చెప్పాలి.

 ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం కాస్త పవన్ కళ్యాణ్ అభిమానులు అందరిని కూడా ఫిదా చేసేస్తుంది. కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత సాధారణంగా పాత గవర్నమెంట్ తాలూకు ఈ ఫొటోస్ అన్ని తీసేసి కొత్త గవర్నమెంట్ కు సంబంధించిన పిక్స్ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలోనూ చంద్రబాబుకు సంబంధించిన ఫొటోస్ పెట్టేసారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఫొటోస్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫొటోస్ కూడా పక్కనే అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండేలా కొత్త రూల్ ని తీసుకువచ్చారట. దీంతో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫొటోస్ కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కనిపించబోతున్నాయి. ఇది తెలిసి పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: