ఏపీ: సంచలన నిర్ణయం.. చంద్రబాబుతో పాటు పవన్ కూడా..!

Divya
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలలో కూటమి 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్నది.. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నాయుడు నాల్గవసారి ప్రమాణస్వీకారం చేశారు . ముఖ్యంగా తన మార్కుతో పలు రకాల నిర్ణయాలతో వేగవంతంగా పనులు చేస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే అమరావతి పోలవరం వంటి వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది చంద్రబాబు. అధికారులతో వరుస సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పలు రకాల నిర్ణయాలను సైతం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలను విషయాలపైన జనసేన శ్రేణులు కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ఉంచాలని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఇద్దరి ఫోటోలు కచ్చితంగా ఉండాలని ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు I &PR అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలంటే ఏపీ సీఎం చంద్రబాబు పలు రకాల ఆదేశాలను సూచించినట్లు సమాచారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు తనతో సమానంగానే హోదా ఉంటుందని కూడా ఎన్నోసార్లు చంద్రబాబు తెలియజేసినప్పటికీ నేతలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

జనసేన నేతలు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంలో చంద్రబాబుని అభినందిస్తూ ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు నుండి పవన్ కళ్యాణ్ పదవి ఏదైనా కానీ తనతో కచ్చితంగా సమానంగా ఉంటుందని విషయాన్ని చంద్రబాబు ఎన్నోసార్లు తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టుగానే అన్నిటిలో కూడా సమాన హక్కులను సైతం కల్పించడంతో జనసేన సైనికులు సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పూర్తిగా టిడిపి పార్టీలోకి జనసేన పార్టీని విలీనం చేసేస్తారా లేకపోతే ఎలా అనే విషయం చూడాలి మరి. 2029 ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: