వైసీపీ : టీడీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్న వైసీపీ నాయకులు..

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఊహించని విధంగా టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి సంచలనం సృష్టించింది.గత ఎన్నికలలో 151 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించిన వైసీపీ ఈ సారి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు.తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు తన మొదటి సంతకం డీఎస్సి పై సంతకం చేసారు... అయితే కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే రాష్ట్రంలో సీన్ మొత్తం మారిపోయింది.అప్పటి వరకూ వైసీపీలో సీనియర్ నాయకులుగా పేరొందిన నాయకులు కొందరు కనీసం ఘోర పరాజయం చెందారు. రాష్ట్రంలో వైసీపీ కి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఏర్పడింది.దీంతో ఆ నాయకులకు అసలు పార్టీలో ఉండాలా..? వద్దా అని ఆలోచనలో పడిన పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా చేసి టీడీపీ లో చేరేందుకు ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారు. 

వైసీపీ నేతలు మాత్రమే కాదు ఆ పార్టీ తరఫున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభజనం సృష్టించినా కూడా స్వల్ప మెజారిటీతో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి విరుపాక్షి గెలుపొందారు.అయితే క్యాడర్‌లో మాత్రం సందేహం నెలకొంది.. ఎక్కడా సంబరాలు కనిపించలేదు... టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు అంతా కూడా డీలా పడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం హడావుడి చేసిన నాయకులు, ఇప్పుడు సైలెంట్‌ అయిపోయారు.. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇప్పుడు మనం పనులు జరగవు అని, ఇప్పుడు ఎలా..అంటూ కొందరు ఆలోచనలో పడ్డారు. టీడీపీ నాయకులతో సాన్నిహిత్యం ఉన్న వారి ద్వారా టీడీపీలో చేరేందుకు వారు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విరూపాక్షి.. పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపారు.. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన టీడీపీలోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: