ఓ జ‌న‌సైనిక్స్ ప‌వ‌న్‌కిచ్చిన శాఖ‌ల‌తో మీరు శాటిస్‌పై అయ్యారా.. నిజం చెప్పమంటే..?

praveen
ఇటీవల ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ సహా మిగతా 24 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే టిడిపి అధికారంలోకి రావడానికి పవన్ ఎంత కీలక పాత్ర పోషించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు టిడిపి గెలుపులో భాగం కావడమే కాదు ఇక తన జనసేన పార్టీని పోటీ చేసిన 21చోట్ల కూడా గెలిపించుకొని 100% స్ట్రైక్ గ్రేడ్ సాధించారు. ఒకరకంగా ఏపీ రాజకీయాల్లో మొన్న వచ్చిన ఫలితాలలో గేమ్ చేంజర్ గా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఇలా కూటమి గెలుపులో ఎంతో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కు ఎలాంటి శాఖను కేటాయించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ముందు ఏకైక డిప్యూటీ సీఎం గా ఎంపిక చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఏకంగా సీఎం హోదాతో సమానంగా ఉండే హోం మంత్రి పదవిని పవన్ కు కట్టబెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో సీఎం అవ్వకపోయినా సీఎం అంతటి మంత్రి స్థాయిలో అటు పవన్ ఉండబోతున్నాడు అని జనసైనికులు అందరూ కూడా ఎంతో ఆనంద పడిపోయారు. కానీ ఇటీవలే శాఖల కేటాయింపులు ఒక భాగంగా అటు పవన్ కు కేటాయించిన శాఖలు తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

 ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు పర్యావరణం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖలను చంద్రబాబు కేటాయించారు. అయితే ఈ శాఖలతో అటు జనసైనికులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జనసేన గెలిచి పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని పదేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులు.. చివరికి పవన్ కు మూడు శాఖలను మాత్రమే కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి అయినా సరిపెట్టుకునే వాళ్ళమని.. కానీ కేవలం ఒక సాదాసీదా మంత్రి గానే పవన్ ఉండిపోతాడు అని తెలిసి అసలు జీర్ధించుకోలేకపోతున్నారట అభిమానులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హోం మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేది అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: