బాబు ప‌య్యావుల కంటే ప‌వ‌న్ తీసిపోయాడా... ఇదేం అన్యాయం ...?

Reddy P Rajasekhar
ఏపీలో కూటమికి తిరుగులేని మెజారిటీ రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణమని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ అనే విషయం టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తారు. అటు టీడీపీతో, ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీలను గెలిపించడంతో పాటు జనసేన 21 స్థానాల్లో విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సక్సెస్ సాధించారు.
 
అయితే అలాంటి పవన్ కళ్యాణ్ కు శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందా అనే ప్రశ్నకు మాత్రం అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వల్లే కూటమికి ఊపు రావడంతో పాటు భారీ మెజార్టీతో కూటమి గెలుపు సాధ్యమైంది. ఏదైనా కారణాల వల్ల పవన్ కు హోం శాఖ ఇవ్వడం వీలు కాకపోతే కనీసం ఆర్థిక శాఖను కేటాయించి ఉంటే బాగుండేది. ఆ మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అర్హుడు.
 
పవన్ కళ్యాణ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా లేవనే సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ కేటాయించిన పయ్యావుల కంటే పవన్ కు ఏం తక్కువని ప‌య్యావుల కంటే ప‌వ‌న్ తీసిపోయాడా? అని పవన్ ఫ్యాన్స్ బాబును ప్రశ్నిస్తున్నారు. పవన్ తో పొత్తు లేని సమయంలో టీడీపీకి ఎలాంటి ఫలితాలు వచ్చాయో గుర్తుంచుకోవాలని పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కళ్ల ముందే పవన్ కు అన్యాయం జరుగుతుంటే పవన్ మోసపోతుంటే ఆవేదనను వెల్లడించకుండా ఉండలేకపోతున్నామని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
 
డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు ఇవ్వకపోవడంలో మర్మమేంటని పవన్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు. రాజకీయంగా పవన్ స్థాయిని తగ్గించాలనే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలను సైతం పవన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు ఫ్యాన్స్ కోరుకున్న శాఖలు దక్కలేదని అదే సమయంలో ప్రాధాన్యత ఉన్న శాఖలు దక్కలేదని పవన్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: