పేరుకే ఆనం సారు మంత్రి... శాఖ చూస్తే షాక్ అయ్యి మూర్చ పోవాల్సిందే..!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. తాజాగా ఇందుకు సంబంధించిన జాబితా విడుదల కాగా ఆనం రామనారాయణ రెడ్డికి శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జాబితాలో ఉన్న మంత్రులకు రెండు నుంచి గరిష్టంగా 4,5 శాఖలు దక్కగా ఒక్క ఆనం రామనారాయణ రెడ్డికి
మాత్రం దేవాదాయ శాఖకు కేటాయించారు.
 
ఈ విధంగా చేయడం ద్వారా పేరుకు ఆనం సారు మంత్రి అయినా ఆయనకు ఒక శాఖ మాత్రమే కేటాయించడాన్ని చూసి మూర్ఛ పోవాల్సిందే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కనీసం మరో శాఖను అయినా ఆయనకు కేటాయించి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపించాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా అత్మకూరుకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి వయస్సు 72 సంవత్సరాలు కాగా ఆయన బీకాం, బీఎల్ చదివారు.
 
రాజకీయ నేతగా ఆనంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆనం విజయం సాధించారు. టీడీపీ హయాంలో ఆర్ అండ్ బీ మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా ఆయన పని చేశారు. ఆయన కుటుంబ సభ్యులలో కొందరికి మంత్రులుగా అనుభవం ఉంది.
 
అన్ని శాఖలపై ఆనంకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండగా ఒక్క శాఖ మాత్రమే కేటాయిస్తే ఆనంకు మంత్రి పదవి ఇచ్చి లాభమేంటనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. దేవాదాయ శాఖ ప్రాధాన్యత ఉన్న శాఖ అయినప్పటికీ ఆనం వయస్సు, అనుభవానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. తనకు ఇచ్చిన శాఖల కేటాయింపు విషయంలో ఆనం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. జాబితాలోని మరి కొందరు మంత్రులకు సైతం అన్యాయం జరిగిందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: