ప‌వ‌ర్ నిల్ స్టార్‌... హోం, ఆర్థిక శాఖ‌లు ఇవ్వ‌కుండా జీరోను చేసిన బాబు..?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హోం, ఆర్థిక శాఖలు ఇస్తే బాగుంటుందని ఈ రెండు శాఖలు ప్రాధాన్యత ఉన్న శాఖలు అని అభిమానులు భావించారు. అయితే చంద్రబాబు మాత్రం హోం, ఆర్థిక శాఖ‌లు ఇవ్వ‌కుండా పవర్ స్టార్ ను ప‌వ‌ర్ నిల్ స్టార్‌ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ తీసుకున్న శాఖల విషయంలో పవన్ ఫ్యాన్స్ ఏ మాత్రం సంతోషంగా అయితే లేరు.
 
ఏ మాత్రం ప్రాధాన్యత లేని శాఖలు ఇవ్వడం వల్ల జనసేనకు ఒక విధంగా అన్యాయం జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు ఇవ్వడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సైతం ఈ విషయంలో ఒకింత మొండిగా వ్యవహరించి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
 
పవర్ స్టార్ కు హోం శాఖ లేదా ఆర్థిక శాఖ దక్కి ఉంటే అసలైన పవర్ దక్కి ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన ఎప్పటికీ కలిసి పోటీ చేయాలంటే పవన్ కు న్యాయం చేయాలని అభిమానులు చెబుతున్నారు. పవన్ కు ఇచ్చిన శాఖలు ఎవరికి ఇచ్చినా ఆ శాఖలను నిర్వహించగలరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ ఎంతో తగ్గి కూటమిని గెలిపించారని ఈ సందర్భంగా చెబుతున్నారు.
 
ఏ పార్టీతో పొత్తు లేకుండా జనసేన సొంతంగా పోటీ చేసినా 21 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం దక్కేదని పొత్తుకు టీడీపీ చేసే న్యాయం ఇదేనా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పొత్తు ధర్మాన్ని చంద్రబాబు పాటించాలని పవన్ కు హోం శాఖ ఇవ్వాలని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తనకు ఇచ్చిన శాఖల విషయంలో పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. తనకు జరుగుతున్న అన్యాయంపై పవన్ ప్రశ్నించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: