ఏపీ: వైయస్ ఫ్యామిలీ కలిస్తే మళ్లీ విజయమేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో టిడిపి పార్టీ విజయం కోసం అటు జనసేన పార్టీ మెగా కుటుంబం సినీ సెలబ్రిటీలు నందమూరి నారా కుటుంబ సభ్యుల సైతం ఎంత శ్రమించాయి.. ముఖ్యంగా జగన్ కుటుంబంలో అటుతల్లి ఇటు షర్మిల ఇద్దరు కూడా ఒకేవైపు ఉండడంతో పాటు వివేకానంద రెడ్డి హత్య వల్ల జగన్ పైన కూడా లేనిపోని అబాండాలు కూడా సృష్టించేలా చేశారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబం కలిసి లేకపోవడం వల్ల జగన్ ఓటమి ఎదురైందని వార్తలు చాలా వినిపిస్తున్నాయి.

చంద్రబాబును గెలిపించడం కోసం నారా నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఉన్నారు. అదే సందర్భంలో తోడు నీడ తప్పించి పక్కన కి ఎవరూ వెళ్లినవారు లేరు. మరొకవైపున జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం రానివ్వలేదు.. ఈ విషయం ఒక్కటే పక్కన పెడితే కళ్యాణ్ రామ్ కూడ.. ఇక రెండో పక్కన వచ్చేసరికి మెగా కుటుంబం అందరూ కూడా చంద్రబాబుకు సపోర్టుగా ఉన్నారు. అల్లు అర్జున్ విషయాన్ని కూడా పక్కన పెడితే.. ముఖ్యంగా ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రభావితం చేయలేదు. కానీ సొంత చెల్లి రక్తం పంచుకున్న చెల్లి జగన్ కి దూరంగా ఉండడంతో తీవ్రమైన ప్రభావం చూపించింది.

ముఖ్యంగా కన్నతల్లి కూడా దూరంగా ఉండడం అనేది జగన్ పట్ల ఒక రకమైనటువంటి బావని అవతలి వాళ్ళలో సృష్టించిందని చెప్పవచ్చు. ఇప్పుడు అన్నను ఊడగొట్టిన చెల్లి.. కసి తీర్చుకుంది.. కానీ తను ఏమాత్రం లబ్ధి పొందలేదు.. మరి రాబోయే రోజుల్లో ఏదైనా లబ్ధి పొందుతుందేమో చూడాలి. అదే సందర్భంలో ఇటు పక్కన కూతురు వెంటనే నిలబడినటువంటి తల్లి విజయమ్మ ఏం సాధించింది.. కొడుకుని పదవికి దూరం చేసింది.. అదే సందర్భంలో కూతురికి ఏమి న్యాయం జరగకుండా పోయింది. ఇప్పుడు మరి మీరేం చేస్తారు చూడాలి.. మరి ఓవరాల్ గా ఈ ఉదాంతంతో మళ్లీ వైయస్ కుటుంబం కలిసి ఉంటుందా లేదా అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: