తెలంగాణ: త్రిబుల్ షూటర్ హరీష్ రావు కాంగ్రెస్ లోకా.. బీజేపీలోకా..?

Pandrala Sravanthi
 గత పది సంవత్సరాలు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పారు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ తర్వాత హరీష్ రావు చేతుల్లోనే ఎక్కువగా ఉండేది అని చెప్పవచ్చు.  ప్రస్తుతం తెలంగాణలో ఉండే టాప్ లీడర్లలో హరీష్ రావు కూడా ఒకరు. సిద్దిపేటలో లక్ష మెజారిటీ కి తగ్గకుండా ప్రతిసారి  అద్భుత విజయాన్ని సాధిస్తున్నారు. అలాంటి హరీష్ రావు  పది సంవత్సరాలపాటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ కాపాడుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా  బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. పార్లమెంటు ఎలక్షన్స్ లో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం చాలా కష్టపడ్డారు.

అయినా ఫలితం దక్కలేదు. దీనికి తోడు పార్టీ పూర్తిస్థాయిలో ఓడిపోవడం  జరిగింది. దీంతో ఓ వైపు కాంగ్రెస్ మరోవైపు బిజెపి బిఆర్ఎస్ చేసిన తప్పులను ఎత్తిచూపుతున్నాయి. అంతేకాదు కేసీఆర్ ని ఏ టైంలో అయినా అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయితే ఆ తర్వాత ఎఫెక్ట్ హరీష్ రావు మీద పడుతుంది.  కాబట్టి హరీష్ రావు వాటి నుంచి తప్పించుకోవాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళ్లిపోవాలి. ఈ క్రమంలోనే  హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయనకు మంత్రి పదవి వస్తుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ  అనేక వార్తలు మాత్రం వస్తున్నాయి. ఇక మరికొన్ని వార్తలేమో  ఆయన బిజెపిలోకి వెళ్తారని, దానికోసం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని  వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు బిజెపిలో చేరితే కేసీఆర్ అరెస్ట్ కాకుండా ఉంటారనే ఆలోచనతోనే అల్లుడిని బిజెపిలో చేర్చే ప్రయత్నాలు కేసీఆర్ మొదలు పెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా హరీష్ రావు మాత్రం కాంగ్రెస్లోకి లేదంటే బిజెపిలోకి  తప్పక వెళ్తారని అంటున్నారు. చూడాలి ముందు ముందు రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: