దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించింది. మరోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఈ ప్రభుత్వం ఇంతలా పట్టు సాధించడానికి ప్రధాన కారకులు జెడియు నితీష్ కుమార్ మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు. వీరిద్దరి సహకారంతోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగలిగింది. వై నాట్ 400 అనే నినాదంతో బరిలోకి దిగిన బిజెపి మామూలుగా భంగపడలేదు. కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత శక్తి కూడా లేకుండా పోయింది. అలాంటి ఈ తరుణంలో ఇండియా కూటమి గతంలో కంటే భారీగా పుంజుకుందని చెప్పవచ్చు. చివరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా కూడా వచ్చింది. నితీష్ కుమార్ చివరి టైంలో హ్యాండ్ ఇవ్వక పోయి ఉంటే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదేమో.
కానీ నితీష్ కుమార్ చివరి సమయంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఇండియా కూటమికి హ్యాండ్ ఇచ్చారు. ఏది ఏమైనా ఇండియా కూటమి మాత్రం బలమైన ప్రతిపక్షంగా ఏర్పడింది. ఇక బిజెపి తీసుకునే ఏ కఠిన నిర్ణయాలనైనా వ్యతిరేకించే విధంగా బలంగా తయారైందని చెప్పవచ్చు. అంతే కాదు ఇండియా కూటమిలో కాంగ్రెస్ 50 స్థానాలకి పరిమితం అవుతుందని మమతా బెనర్జీ ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించారు. కానీ ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ కాంగ్రెస్ దాదాపు 90 సీట్లు సాధించింది. దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అని చెప్పవచ్చు. ఆయన భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరుగుతూ ప్రజల్లో ఉంటూ సమస్యలపై ఆరా తీశారు. దీంతో దేశవ్యాప్తంగా రాహుల్ కు మంచి ఆదరణ లభించింది. దానివల్లే ఉత్తరప్రదేశ్ లో కూడా ఎక్కువ సీట్లు గెల్చుకోగలిగింది.
అంతే కాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి కూడా చేరుకుంది. కొద్దిలో అధికారాన్ని మిస్సయిన రాహుల్ గాంధీ నెక్స్ట్ ఎన్నికల వరకు తప్పకుండా ఎదిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఈ తరుణంలో ఇండియా కూటమిగా ఏర్పడిన ఇతర పార్టీలన్నీ, ఆయనతో మరో ఎన్నికల వరకు కలిసి ఉంటాయా విడిపోతాయా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం విడిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది . ఒకవేళ విడిపోయినా కానీ రాహుల్ గాంధీ సొంతంగా పార్లమెంటులో బిజెపి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూ దేశమంతా తిరుగుతూ ప్రజా సమస్యలపై కొట్లాడితే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు గట్టి లీడర్ గా తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా ప్లానింగ్ ప్రకారం రాహుల్ గాంధీ ముందుకు వెళ్తేనే దేశంలో తిరుగులేని లీడర్ గా మారగలరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.