రాజకీయాల్లో.. తొలి సంతకం ట్రెండ్ ఎప్పుడు మొదలైందంటే?

praveen
- వైయస్సార్ తోనే తొలి సంతకం ట్రెండ్ స్టార్ట్
- మొన్న రేవంత్, నిన్న మోడీ, ఇప్పుడు చంద్రబాబు సేమ్ రూట్
- ట్రెండ్ ఫాలో అవుతున్న కీలక నేతలు
( ఏపీ - ఇండియా హెరాల్డ్ )
ఇటీవల ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది  ఏకంగా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే  ఇదే వేదికపై చంద్రబాబు క్యాబినెట్ లోని మిగతా మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పాలి. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి సంతకం దేనిపై చేయబోతున్నారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గతంలో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే ఉంటుందని చెప్పారు చంద్రబాబు.

 చెప్పినట్లుగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైన చేశారు అని చెప్పాలి. అయితే కేవలం చంద్రబాబు మాత్రమే కాదు ఇలా ఏ రాష్ట్రంలో ఎవరు కొత్తగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి సంతకం దేనిపైన చేయబోతున్నారు అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కూడా అందరిలో ఇదే ఉత్కంఠ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా తొలి సంతకం ట్రెండు ఎప్పుడు మొదలైంది అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

 ఆ వివరాలు చూసుకుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తోనే ఈ తొలి సంతకం అనే ట్రెండ్ మొదలైంది అని తెలుస్తోంది  2004 మే 14వ తేదీన ఎల్బీ స్టేడియంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇలా ప్రమాణ స్వీకార వేదికపైనే రైతులకు ఫ్రీ కరెంట్ హామీపై తొలి సంతకం చేశారు. ఇక అప్పటినుంచి ఈ తొలి సంతకం అనే ట్రెండు నడుస్తూ వస్తుంది. అంతకుముందు ఇప్పుడు ఉన్నంత క్రేజ్ ఉండేది కాదు.. కానీ మొన్న మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేపట్టగానే పీఎం కిసాన్, అటు రేవంత్ ప్రమాణ స్వీకారం చేపట్టగానే ఆరు హామీలు, ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేపట్టగానే మెగా డీఎస్సీ పై సంతకం చేయడంతో తొలి సంతకానికి మరింత క్రేజ్ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: