పీకే: బిజెపిపై సంచలన వ్యాఖ్యలు..!

Divya
2019లో జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ మరొకసారి ప్రధాని చేయాలి అంటూ కూడా బిజెపి పార్టీ భారీగానే ప్రచారం చేసుకుని దూసుకుపోయింది. ఈ నినాదం బాగా దూసుకుపోయి 2019లో సొంతంగానే బిజెపి పార్టీ భారీ సీట్లను గెలుచుకుంది. బిజెపి చరిత్రలోనే మొదటిసారిగా 300 మార్కును దాటి 303 కు చేరింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నినాదం ఏ మాత్రం పెద్దగా ఇన్ఫాక్ట్ చూపలేదని చెప్పవచ్చు. గతంలో కంటే సంఖ్య పెరగడం పక్కన పెడితే కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అవసరమైన సంఖ్య బలాన్ని కూడా పొందలేకపోయింది.

ఇంకా చెప్పాలంటే ఈ నినాదమే బేడిసి కొట్టిందని చాలామంది విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. ఈసారి 400 సీట్లు దాటాలని నినాదాన్ని కొన్ని రాష్ట్రాలలో మంచి ఫలితాలను అందుకున్నప్పటికీ గత ఎన్నికలలో కంటే భారీ సంఖ్యను కట్టబెట్టిన పెద్ద రాష్ట్రాలు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చినట్లుగా కనిపిస్తోంది. 400 సీట్లు దాటి గెలవాలని ప్రయత్నించిన బిజెపి కూటమిగా కూడా సాధించలేకపోయింది. సొంతంగా 240 సీట్లతో కూటమితో 293 సీట్లతో సరిపెట్టుకుంది.

తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లోక్సభ ఎన్నికలలో బిజెపి వైఫల్యం గురించి మాట్లాడుతూ.. ఆయన విశ్లేషణ నూటికి నూరు శాతం నిజమైందని కేంద్రంలో బిజెపి సాధించిన విజయంలో అంచనాలు కొంతమేరకు తప్పాయి బిజెపి లక్ష్యంగా పెట్టుకున్న 400 సీట్లు రాకపోయినా సొంతంగా 300 సీట్లు సాధిస్తుందని ఎన్నికల ముందు తెలిపారు.కానీ అలా రాకపోవడానికి కారణాలు ఏమిటంటే మోదీ అనే నినాదమే సర్కారు అహంకానికి నిదర్శనంగా వేటుపడిందని పీకే తెలియజేశారు. అంతేకాకుండా అత్యధిక సీట్లతో మోడీ అధికారంలోకి వస్తే చాలా కఠిన నిర్ణయాలు ఉంటాయని ప్రచారం సరికొత్త సందేహాలకు తావు ఇచ్చిందని రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారనే విధంగా వార్తలు వినిపించాయి అని అందుకే ఈసారి చాలా తక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు పీకే. ముఖ్యంగా చాలా సంఘాలు రిజర్వేషన్ల పైన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించాయని తెలిపారు. అలాగే అమిత్ షా కూడా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పడంతో.. చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా తొలగిస్తామని చెప్పారు ఇవే బిజెపికి దెబ్బ పడేలా చేశాయని తెలిపారు. అలాగే పదేళ్లు పరిపాలన ట్రైలర్ మాత్రమే ముందుంది అసలు సినిమా అంటూ మోడీ చేసిన ప్రసంగాలు చాలా అనుమానాలకు దారితీసాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: