ఈ ఐదేళ్లు ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ ట్విస్ట్‌లు చూస్తాం..!

RAMAKRISHNA S.S.
- కోరం లేదు.. వైసీపీ వాళ్ల‌కు నో మైక్‌
- వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిది.. మాట్లాడేది లేదు
- జ‌గ‌న్ సైతం అసెంబ్లీకి నో గ్యారెంటీయే
- అధికార‌ప‌క్ష‌మే స‌మ‌స్య‌లు మాట్లాడాలి.. ప‌రిష్క‌రించాలి..
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఈ సారి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు స‌జావుగానే సాగ‌నున్నాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి స‌భ‌లు అంటే.. ర‌ణ‌గొణ ధ్వ‌నులు.. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య అరుపులు, కేక‌లు.. స‌స్పెండులు.. వంటివి కామ‌న్‌. ఒక్కొ క్క‌సారి స‌భ‌లు జ‌రుగుతుంటే.. ప్ర‌జ‌ల‌కు సైతం చిరాకు పుట్టించే ప‌రిస్థితి నెల‌కొంటోంది. ఇక‌, ప్ర‌తిప‌క్షానికి అవ‌కాశం ఇవ్వ‌ని అధికార ప‌క్షాల‌ను కూడా చూశాం. గుండుగుత్త‌గా.. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసి.. మార్ష‌ల్స్‌తో గెంటించిన సంద‌ర్భాలు కూడా.. ఎరుకే..!

అయితే.. ఇప్పుడు ఏపీలో కొలువుదీరుతున్న స‌భ‌లో వ‌చ్చే ఐదేళ్ల‌పాటు.. ఇలాంటి దృశ్యాలు దాదాపు కాదు.. అస‌లు క‌నిపించే అవ‌కాశం కూడా లేదు. ఎందుకంటే.. అస‌లు ప్ర‌తిప‌క్షం లేదు. వైసీపీ నుంచి జ‌గ‌న్ స‌హా 11 మంది మాత్ర‌మే ఎన్నిక‌య్యారు. వీరు స‌భ‌ల‌కు వెళ్లేది లేదు. వెళ్లినా.. మాట్లాడే ప‌రిస్థితి కూడా లేదు. ఎందుకంటే.. కోరం లేదు కాబ‌ట్టి మైకు ఇవ్వ‌మ‌ని వారు అడిగినా.. రూల్స్ ప్ర‌కారం ఇచ్చే ఛాన్స్ లేదు. అస‌లు స‌భ‌ల‌కు వెళ్ల‌రాద‌ని కూడా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

ఇక‌, ఉన్న‌ది బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ స‌భ్యులే. ఇక, వీరిలోనూ.. స‌భ‌లో సింహం మాదిరిగా చంద్ర‌బాబు, మ‌రోవైపు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ఖ‌చ్చితంగా ఉంటారు కాబ‌ట్టి.. ఎవ‌రూ దురుసు వ్యాఖ్య‌లు చేయ‌డం.. దుందుడుకు వ్యాఖ్య‌లు చేయ‌డం నోరుపారేసుకోవ‌డం అనే ప్ర‌శ్నే ఉండ‌దు. అంతా అర్ధ‌వంత‌మైన చ‌ర్చ‌లు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తీర్మానాలు.. త‌ప్పుల‌పై ప‌రిష్కారాలు వంటివి మాత్రమే క‌నిపించ‌నున్నాయి. ఏ చిన్న తేడా వ‌చ్చినా హెచ్చ‌రించేందుకు చంద్ర‌బాబు, ప‌వ‌న్ వంటి పెద్ద త‌ల‌కాయ‌లు ఉండ‌డంతో అసెంబ్లీ స‌జావుగా సాగుతుంద‌నే చెప్పాలి.

అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దేళ్ల‌లో జ‌రిగిన స‌భ‌ల‌కు.. ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఐదేళ్ల స‌భ‌ల‌కు కూడా.. తేడా స్ప‌ష్టంగా క‌నిపించ‌నుంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను గ‌తంలో ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తితే.. ఇప్పుడు అధికార ప‌క్ష స‌భ్యులే వాటిని ప్ర‌స్తావించి.. ప‌రిష్కారాలు క‌నుగొనే ప్ర‌య‌త్నం చేస్తారు. ఇదొక చిత్ర‌మైన ప‌రిస్థితి అయిన‌ప్ప‌టికీ.. ఏపీ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పున‌కు భిన్నంగా ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు అయితే.. ఇది కూడా.. ఒక‌ర‌కంగా ప్ర‌జ‌లు మేలు చేకూర్చేదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: