చంద్రబాబు చెప్పిన మెగా డీఎస్సీలో.. ఎందులో ఎన్ని పోస్టులో తెలుసా?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తాము అంటూ చెప్పి అటు నిరుద్యోగులందరిని  తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఆ నిరుద్యోగుల మద్దతుతోనే అఖండ విజయాన్ని సాధించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ఫలితాలలో అటు టిడిపి కూటమి ఘనవిజయాన్ని సాధించడంతో ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు.

 ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తొలి సంతకాన్ని చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్ పైన సంతకం చేసారు అని చెప్పాలి. అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీకి అనుమతిస్తూ తొలి సంతకం చేస్తారు అంటూ ప్రచారం జరిగింది. కానీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరణ అనంతరం ఇక ఈ ఫైల్ పై అయినా సంతకం చేశారు. దీంతో ఎంతోమంది నిరుద్యోగుల ఆశలకు కొత్త ఊపిరి పోసినట్లుగా అయిపోయింది. మొన్నటి వరకు ఇక మెగా డీఎస్సీ ఎప్పుడు వస్తుందో అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన ఎంతో మంది నిరుద్యోగులు.. ఇక చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేయడంతో సంతోషంలో మునిగిపోతున్నారు.

 కాగా మెగా డీఎస్సీ లో భాగంగా మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు అటు చంద్రబాబు నాయుడు ప్రకటించారు అని చెప్పాలి. అయితే ఇందులో ఎందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న విషయంపై కొంతమందికి క్లారిటీ లేదు. కాగా ఆ వివరాలు చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ 7725  ఎన్జిటి 6371, టిజిటి 1781, పిజిటి 286, ప్రిన్సిపల్స్ 32, పిఈటి 132 పోస్టులను ఈ మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నారట. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఇలా గవర్నమెంట్ ఉద్యోగం సాధించేందుకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు అందరూ ఇప్పుడు మెగా డీఎస్సీలో ప్రకటనతో తప్పకుండా ఉద్యోగం వస్తుంది అనే భీమ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: