ఏపీలో సినీ ఇండ‌స్ట్రీకి కొత్త‌ ప‌వ‌నాలు... ఆ రెండు ప్లేస్‌ల ద‌శ తిరుగుతోంది..!

RAMAKRISHNA S.S.
- విశాఖ‌, తిరుప‌తి కేంద్రంగా సినీ ప‌రిశ్ర‌మ డ‌వ‌ల‌ప్మెంట్‌కు ఛాన్స్‌
- ప‌వ‌న్‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్న టాలీవుడ్‌
( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన ప్ర‌భుత్వంపై వివిధ వ‌ర్గాల‌కు భారీ ఆశ‌లే ఉన్నాయి. వీటిలో సినీ రంగం ఒక టి. రాష్ట్ర విభ‌జ‌న‌తో హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైన సినీ రంగాన్ని ఏపీకి తీసుకువ‌చ్చేందుకు గ‌త చంద్ర‌బా బు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. అయితే.. అది సాకారం అయ్యేలోగానే.. వైసీపీ స‌ర్కారు వ‌చ్చింది. ఇక‌, అప్ప‌టి నుంచి సినీ ఇండ‌స్ట్రీని భ‌య పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో సినీరంగ పెద్ద‌లు విశాఖ‌లో భూములు కొనుగోలు చేసినా.. కూడా అడుగు మాత్రం పెట్ట‌లేదు.

నిజానికి ఏపీలోని అర‌కు, తిరుమ‌ల‌, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, చంద్ర‌గిరి వంటి ప్రాంతాల‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేయ‌డం ద్వారా.. సినీరంగాన్ని ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు. వివిధ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను కూడా తీసుకువ‌చ్చి.. వారితో చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. సినీ ఇండ‌స్ట్రీని ఏపీకి తీసుకువ‌స్తే.. ఆర్థికంగా ప్ర‌యోజ‌నం జ‌రుగుతుంద‌ని.. స్థానికంగా ఉపాధి పెరుగుతుంద‌ని కూడా అంచ‌నా వేసుకున్నారు.

కానీ, అప్ప‌ట్లో సాధ్యం కాలేదు. వైసీపీ వ‌చ్చాక‌.. పూర్తిగా అట‌కెక్కాయి. మ‌రోవైపు చిన్న చిత‌కా థియేట‌ర్లు కూడా.. క‌రోనా ఎఫెక్ట్‌తో మూత‌బ‌డ్డాయి. దీంతో వంద‌ల మందికి ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం కొంత మేర‌కు సినీ రంగంలో ఆశ‌లు పుష్పించాయ‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఇదే రంగానికి చెందిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకుంటున్నార‌నే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆయన మంత్రిగా కూడా ప్ర‌మాణం చేశారు.

దీంతో ఆయ‌న చొర‌వ కార‌ణంగా రాష్ట్రంలో కొత్త ధియేట‌ర్ల ఏర్పాటుతో పాటు.. సినీ ఇండ‌స్ట్రీ కూడా.. విశాఖ‌కు త‌ర‌లి వ‌చ్చినా.. ఆశ్చ‌ర్యం లేదు. అంతేకాదు.. సినీ రంగానికి, నిర్మాత‌ల‌కు ఉన్న అనేక స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉంది. త‌ద్వారా ఏపీకి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు కూడా అందించేలా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తార‌నే.. ఆశ‌లు ఉన్నాయి. దీంతో సినీ ఇండ‌స్ట్రీ ప‌వ‌న్‌పై పెద్ద హోప్సే పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఐదేళ్లు ఆయ‌న కొంత స‌మ‌యం కేటాయించి తీసుకునే నిర్ణ‌యాలు స‌క్సెస్ అయితే.. దాదాపు హైద‌రాబాద్ స్థాయిలో విశాఖ డెవ‌ల‌ప్ అయ్యేందుకు అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: