బుచ్చ‌య్య - నిమ్మ‌ల‌.. వ్య‌వ‌సాయానికి వెన్నుద‌న్ను...!

RAMAKRISHNA S.S.
- వ్య‌వ‌సాయానికి బుచ్చ‌య్య‌, నిమ్మ‌ల స‌ల‌హాలు
- ఆనంకు వ్య‌వ‌సాయంపై గ‌ట్టిప‌ట్టే
- ఏపీలో రైత‌లకు కూట‌మి స‌ర్కార్ క‌లిసొచ్చేనా
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న వారిలో ఇద్ద‌రు కీల‌క ఎమ్మెల్యేలు.. వ్య‌వ‌సాయానికి వెన్నుద‌న్నుగా ఉండే అవ‌కాశం ఉంది. వీరిలో ఒకు మంత్రి ప‌ద‌విని కూడా ద‌క్కించుకున్నారు. ఒక‌రు సీనియ‌ర్ నాయ‌కు డు. వారే ఒక‌రు రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి, పాలకొల్లు ఎమ్మెల్యే క‌మ్ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. ఇద్ద‌రూ కూడా వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన వారే కావ‌డంతో ఇద్ద‌రూ కూడా.. వ్య‌వ‌సాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. రాష్ట్రాన్ని తిరిగి అన్నపూర్ణ‌ను చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు. దీనిలో భాగంగా వ్య‌వ‌సాయ శాఖ‌ను ప‌రిపుష్టం చేసేం దుకు అసెంబ్లీ వేదిక‌గా.. స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చే అవ‌కాశం ఉంది. దీనిలో కీల‌క పాత్ర అటు మంత్రి నిమ్మ‌ల‌కు, ఇటు సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడిగా బుచ్చ‌య్య కూడా పెద్ద అవ‌కాశం చిక్కుతుంద‌నే చెప్పా లి. గ‌తంలోనూ బుచ్చ‌య్య చౌద‌రి వ్య‌వ‌సాయ రంగ స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో అనేక చ‌ర్చ‌లు చేసి ఉన్నారు.

ఇక‌, నిమ్మ‌ల రామానాయుడు కూడా.. ఆర్బీకేలు, రైతుల స‌మ‌స్య‌ల‌పై అనేక సంద‌ర్భాల్లో అసెంబ్లీలో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. ఇప్పుడు కూడా వీరు ఇదే యాక్టివ్ నెస్ ప్ర‌ద‌ర్శించేందుకు అవ‌కాశం ఉంది. ఇక్క‌డ వారికి క‌లిసి వ‌స్తున్న మ‌రో అవ‌కాశం.. త‌మ ప్ర‌భుత్వ‌మే ఉండ‌డం.. తాము చేసిన సూచ‌న‌ల‌ను కూడా.. పార్టీ అంగీక‌రించే అవ‌కాశం ఉండ‌డం. ఇద్ద‌రికీ క్షేత్ర‌స్థాయిలో వ్య‌వ‌సాయ రంగంపై అనుభ‌వం ఉండ‌డంతో వీరికి బ‌ల‌మైన వేదిక ల‌భించిన‌ట్టే అవుతుంది.

వీరే కాదు.. మ‌రో మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కూడా.. రైతాంగంపై అవ‌గాహ‌న ఉన్న నాయ‌కుడు కావ‌డంతో ఈయ‌న కూడా గ‌ళం వినిపించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక‌, ఇత‌ర నేత‌ల్లో అయ్య‌న్న పాత్రుడు వంటి వారికి కూడా రైతాంగ స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉంది. సో.. ఎలా చూసుకున్నా నిమ్మ‌ల‌, బుచ్చ‌య్య‌ల స‌ల‌హాలకు ఈ సారి వ్య‌వ‌సాయ రంగంలో గ‌ట్టి ప్రాధాన్యం ల‌భించే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: