ఏపీ: చదివింది 8వ తరగతి.. ఏకంగా మంత్రి..?

Divya
ఏదైనా ఉద్యోగం సాధించాలి అంటే విద్యా అర్హత కచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రులు వంటి వారికి మాత్రం టెన్త్ ఫెయిల్ అయిన కూడా సీట్ల సంపాదిస్తూ ఉంటారు. టెన్త్ ఇంతవరకు చదివిన పరవాలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొలువదీరిన మంత్రులు ఏం చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారనే అంశానికి వస్తే.. ముఖ్యంగా మెడిసిన్ చదివిన వారు కూడా ఉండగా పిహెచ్డిలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. ఎక్కువమంది డిగ్రీలు పీజీలు ఎంబీఏ లు కూడా చేసిన వారు ఉన్నారు వీరితోపాటు టెన్త్ డిస్కంటిన్యూ అయిన వారు కూడా ఉన్నారట.

అంతేకాకుండా తక్కువ చదువుకున్న బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల అఫీడవిట్లో పేర్కొన్న ప్రకారం ఈయన కేవలం 8వ తరగతి మాత్రమే చదివారని కర్నూలు జిల్లా బలంగానపల్లి గవర్నమెంట్ స్కూల్లో SSLC ఇన్ కంప్లీట్ చేశారని కూడా తెలిపారు. 2014లో మొదటిసారి బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలలో ఓడిపోయారు 2024 ఎన్నికలలో విజయం సాధించి ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. పిఠాపురం నుంచి గెలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటర్ వరకు చదువుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫీడవిట్లో తెలియజేశారు.

గొట్టిపాటి రవికుమార్ కూడా ఇంటర్ వరకు చదువుకున్నారు. తాజాగా మంత్రి పదవి కూడా సంపాదించుకున్నారు. మరొక నేత పార్థసారధి కూడా ఇంటర్ వరకు చదువుకున్నట్లు ఎన్నికల ఆఫిడ విట్లో తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. నారా లోకేష్ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు.. అలాగే మరొక నేత కింజారావు అచ్చమ్మ నాయుడు డిగ్రీ వరకు చదువుకున్నారు. కొల్లు రవీంద్ర రెండు డిగ్రీలను పూర్తి చేశారు బిఏ,ఎల్ఎల్బి వంటి వరకు చదివారు. వంగలపూడి అనిత ఎంఏ ఎంఈడి చేసింది ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేసింది. పయ్యావుల కేశవ్ డిగ్రీ వరకు చదువుకున్నారు. గుమ్మడి సంధ్యారాణి బిఎస్సి గా చేసింది. సత్య ప్రకాష్ డిగ్రీ వరకు చదువుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: