ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. యువత భవిత మారుస్తున్నారుగా!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రబాబు నాయుడు కీలక ఎన్నికల హామీల అమలుకు తొలిరోజే పచ్చజెండా ఊపారు. 5 అంశాల అమలు దస్త్రాలపై చంద్రబాబు సంతకాలు చేశారు. 16,347 టీచర్ల పోస్టుల కోసం మెగా డీఎస్సీ విడుదల చేసే దస్త్రంపై బాబు తొలి సంతకం పెట్టారు.
 
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై బాబు రెండో సంతకం చేశారు. ఏపీలోని లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు మేలు జరిగేలా పింఛన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేశారు. ఇకపై ఏపీలో అర్హత ఉన్నవాళ్లు ఏకంగా 4,000 రూపాయల పింఛన్ అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే యువతకు మేలు జరిగేలా స్కిల్ సెన్సస్ దస్త్రంపై చంద్రబాబు నాయుడు నాలుగో సంతకం చేశారు.
 
నైపుణ్య గణన దస్త్రంపై చంద్రబాబు చేసిన సంతకం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. నైపుణ్య గణన నిర్ణయం దేశానికి ఆదర్శం అయ్యే నిర్ణయం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో భవిష్యత్తులో పరిశ్రమలు వస్తే నైపుణ్యాలు ఉన్న వాళ్ల వివరాలను ప్రభుత్వం వేగంగా పరిశ్రమల యాజమాన్యాలకు అందించే అవకాశం ఉంది. ఈ వివరాల వల్ల ఇతర రాష్ట్రాల్లో పని చేసేవాళ్లు సైతం మన రాష్ట్రంలో అదే వేతనంతో ఉద్యోగాలు పొందే ఛాన్స్ ఉంటుంది.
 
నైపుణ్య గణన వల్ల ఉద్యోగ అవకాశాలు యువతకు ఊహించని స్థాయిలో పెరగడంతో పాటు చంద్రబాబు హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ నిర్ణయం విషయంలో చంద్రబాబును పారిశ్రామికవేత్తలు సైతం అభినందిస్తున్నారు. నైపుణ్య గణన ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించి వాళ్లకు తగిన శిక్షణ ఇస్తే కూడా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. చంద్రబాబు ముందుచూపును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: