ఈ టీడీపీ నేత మనస్సు బంగారం.. ప్రజలకు కష్టమొస్తే మంత్రి బీసీ జనార్ధన్ అస్సలు తట్టుకోలేరుగా!

Reddy P Rajasekhar
దేశంలో చాలా మంది రాజకీయ నేతలు స్వార్థపూరితంగా ఉంటారు. పార్టీ ఓడిపోతే, ఎమ్మెల్యేగా గెలవకపోతే ప్రజల గురించి పట్టించుకునే నేతలు చాలా తక్కువమంది ఉంటారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బీసీ జనార్ధన్ రెడ్డి వాళ్లతో పోల్చి చూస్తే ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఈ టీడీపీ నేత మనస్సు బంగారం అని చాలామంది భావిస్తారు. 2019 నుంచి 2024 వరకు తమ పార్టీ అధికారంలో లేకపోయినా తనకు పదవి లేకపోయినా బీసీ జనార్ధన్ రెడ్డి ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు.
 
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం నుంచి 2014 సంవత్సరంలో బీసీ జనార్ధన్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2019 సంవత్సరంలో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి గెలిచిన బీసీ జనార్ధన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం నుంచి 25 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ప్రజలకు అండగా నిలబడటం వల్ల కొన్ని సందర్భాల్లో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
 
బీసీ జనార్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. బీసీ జనార్ధన్ రెడ్డి విద్యార్హత ఎనిమిదో తరగతి మాత్రమే అయినా ఆయనలో ఉన్న సేవా గుణం చూసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీసీ జనార్ధన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో బనగానపల్లె టీడీపీ కార్యకర్తలు ఎంతో సంతోషిస్తున్నారని సమాచారం అందుతోంది.
 
ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి ముగ్గురు నేతలకు మంత్రి పదవులు కేటాయించడం ఇవ్వడం గమనార్హం. ఒకప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట కాగా ఈ ఎన్నికల ఫలితాలతో ఆ లెక్కలు మారిపోయాయి. రాబోయే రోజుల్లో ఉమ్మడి కర్నూలులో టీడీపీ పుంజుకోవడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగా ఒక స్థానంలో బీజేపీ గెలిచింది. బీసీ జనార్ధన్ రెడ్డి గెలుపుతో బనగానపల్లె శరవేగంగా అభివృద్ధి చెందడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: