40 ఏళ్ళ హిస్టరీలో ఇది సెకండ్ టైమ్.. బాబు ఇలా చేసాడేంటి?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో అఖండ విజయాన్ని సాధించిన టిడిపి జనసేన బిజెపి పార్టీల కూటమి ఇక ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఇక 24 మంత్రులు కూడా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి సీనియర్లకు కాకుండా జూనియర్లకే చంద్రబాబు క్యాబినెట్లో పెద్దపీట వేశారు. దీంతో పార్టీ కోసం ఎన్నో రోజుల నుంచి పనిచేసిన సీనియర్లకు అన్యాయం జరిగిందని వాదన కూడా తెరమీదికి వస్తుంది.

  మొదటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కూడా ఏకంగా చంద్రబాబు మంత్రి పదవిని కట్టబెట్టడం కొంతమందిని ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి. ఇలా బాబు క్యాబినెట్ లో చోటు సంపాదించుకున్న వారిలో ఎవరికి ఏ శాఖను కేటాయించబోతున్నారు. ఇక ఆయా శాఖలో ఇక మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన వారి ముందు ఉన్న సవాళ్లు ఏంటి అన్న విషయం గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక మరికొన్ని విషయాలు కూడా తెరమీదకి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే చిత్తూరు జిల్లా నుంచి మాత్రం ఒక్కరు కూడా మంత్రి పదవి దక్కించుకోలేదు అని చెప్పాలి.

 నలభై ఏళ్ల ఆంధ్ర పొలిటికల్ హిస్టరీలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అది కూడా టిడిపి హయాంలోనే ఇలా జరగడం గమనార్హం. ఎందుకంటే రాష్ట్ర క్యాబినెట్లో చిత్తూరు జిల్లా నుంచి ఎవరికి ఈసారి మంత్రి పదవి దక్కలేదు. 1983లో టిడిపి ఆవిర్భవించిన తర్వాత ఎన్టీఆర్ తిరుపతి నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలోనే 15 మందితో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో చిత్తూరు ఎమ్మెల్యేలకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈసారి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గాను 12 గెలిచినా.. అక్కడ ఎవరికీ మంత్రి పదవి పదవి దక్కకపోవడం గమనార్హం. అదే జిల్లాకు చెందిన చంద్రబాబు సీఎంగా ఉండి కూడా ఇలా ఎవరికి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే చిత్తూరు జిల్లా వాసి అయిన చంద్రబాబు సీఎం పదవి చేపట్టారు కాబట్టే.. ఆ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు అనే వాదన కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: