ఓడిన చోటే గెలిచాడు.. ఆ నోర్లు మూయించాడు.. మంత్రి నాదెండ్ల ప్రస్థానం ఎంతో ప్రత్యేకం!

Reddy P Rajasekhar
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయి నేత ఎవరనే ప్రశ్నకు నాదెండ్ల మనోహర్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాదెండ్ల మంత్రిగా తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన నుంచి తెనాలి తరపున పోటీ చేసిన నాదెండ్ల 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం నాదెండ్ల వయస్సు 60 సంవత్సరాలు కాగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చదివారు.
 
నాదెండ్ల మనోహర్ 2004 సంవత్సరంలో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 2009 సంవత్సరంలో తెనాలి నుంచి ఆయన మరోసారి విజయం సాధించగా ఉమ్మడి ఏపీ శాసనసభలో ఆయనకు డిప్యూటీ స్పీకర్ గా పని చేసే అవకాశం దక్కింది. 2011 సంవత్సరంలో నాదెండ్ల మనోహర్ శాసనసభ స్పీకర్ గా ఎన్నికై 2014 సంవత్సరం వరకు ఆ పదవిలో కొనసాగారు.
 
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018లో జనసేనలో చేరి జనసేన వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా పని చేసిన ఆయన 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే రెండుసార్లు ఓటమిపాలైన నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన ఆయన 50 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ మంత్రిగా ఆయన తొలిసారి అవకాశం దక్కించుకున్నారు.
 
జనసేన నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా తన గురించి విమర్శలు చేసిన వాళ్ల నోర్లను మూయించడంలో నాదెండ్ల మనోహర్ సక్సెస్ అయ్యారు. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఉమ్మడి ఏపీకి మాజీ సీఎంగా పని చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం నాదెండ్ల మనోహర్ కు ఎంతో గౌరవం ఇస్తారు. ఇతర రాజకీయ నేతలతో పోల్చి చూస్తే నాదెండ్ల రాజకీయ ప్రస్థానం ఎంతో ప్రత్యేకం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: