వైసిపి:మాజీ ఎమ్మెల్యే.. ఉత్కంఠగా మారిన కోర్టు తీర్పు..!

Divya
వైసిపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పైన ఈరోజు మరొక సారి విచారణ జరగబోతున్నది.. గత విచారణలో ఇవాల్టి వరకు ముందస్తు బెయిల్ ను పొడిగించిన హైకోర్టు ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసులలో కూడా ఈయన పైన నమోదు కావడంతో మద్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు తర్వాత జరిగిన కొన్ని గొడవలు వైసిపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన దాదాపుగా నాలుగు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈవీఎం ధ్వంసం కేసులు A1 గా ఈయన పేరును చేర్చారు.

గతంలో టిడిపి రిలీజ్ చేసిన వీడియో ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టులో వాదనలు సైతం వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈయనకు మధ్యంతర బెయిల్  ని కూడా విడుదల చేయడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు మద్యంతర బెయిల్  మరికొన్ని రోజులు పొడిగించే విధంగా హైకోర్టు ఆదేశించింది. అయితే గతంలో కూడా పిన్నెల్లి తాను ఎక్కడికి పారిపోవడం లేదని తన పాస్పోర్టు కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని అలాగే టిడిపి ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని అరెస్టు చేస్తారా అంటూ కూడా తనను ప్రశ్నించడం జరిగింది.

పల్నాడు జిల్లాలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఈయన ఉన్నట్లు సమాచారం. అయితే ఈరోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు వెలుపడతాయని విషయం పైన చాలా ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుత వైసిపి పార్టీ కూడా అధికారంలో లేకపోవడం వల్ల ఏం జరుగుతుందా అంటూ ఆయన కార్యకర్తలు వైసిపి నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి భవిష్యత్తు మొత్తం కోర్టు తీర్పు పైన ఆధారపడి ఉందని కూడా చెప్పవచ్చు. మరి కొన్ని గంటలలో పూర్తిగా తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: