లోకేష్‌కు బ్రేకులు వేసిన చంద్ర‌బాబు... ఏం జ‌రిగింది...!

RAMAKRISHNA S.S.
- దూర‌దృష్టితో బాబు కొత్త ఎత్తు
- ప‌వ‌న్‌కు ప్రాధాన్యం కోసం లోకేష్‌ను డౌన్ చేసే ప్లాన్‌
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహాల‌కు మ‌రింత పదును పెంచారా?  చాలా కీల‌క‌మైన వ్య‌క్తులు, నాయ‌కుల విష‌యం లో ఆయ‌న నిర్ణ‌యాలు ఎలా ఉంటాయ‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం టీడీపీలో నెంబ‌ర్ 2 పొజిష‌న్ నారా లోకేష్‌దే. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా.. ఆయ‌న మ‌రింత‌గా పార్టీ నేత‌ల‌కు చేరువ‌య్యారు. ఇక‌, పార్టీలోనూ టికెట్ల విష‌యంలో తాను కోరుకున్న వారికి ప్రాధాన్యం ఇప్పించారు. భాష్యం ప్ర‌వీణ్ వంటివారికి లోకేష్ టికెట్లు ఇప్పించార‌నేది తెలిసిందే.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ ప‌రంగా ఆయ‌న గ్రాఫ్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వంలో మాత్రం నారా లోకేష్‌ పాత్ర మునుపు ఉన్న‌ట్టుగా ఉండే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. నారా లోకేష్‌కు ప్రాధాన్యం పెంచుకుంటూ పోతే.. కీల‌క‌మై న మిత్ర ప‌క్షం జ‌న‌సేన పార్టీ ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంతేకాదు.. ఇది కూట‌మి ప్ర‌భుత్వంపైనా ప్ర‌భావితం చూపిస్తుంది. ఈ విష‌యాన్ని ముందుగానే గ్ర‌హించిన చంద్ర‌బాబు గ‌త రెండు మాసాలు గా నారా లోకేష్ ప్రాధాన్యాన్ని దాదాపు త‌గ్గిస్తున్న‌ట్టుగానే సంకేతాలు ఇస్తున్నారు. అయితే.. ఇది ఉద్దేశ పూర్వ‌క‌మా.. కాదా? అనేది ప‌క్క‌న పెడితే.. పార్టీలోనూ చ‌ర్చ సాగుతోంది.

ఉమ్మ‌డి పార్టీల స‌మావేశం జ‌రిగి.. చంద్ర‌బాబును  శాస‌న స‌భా పక్ష నాయ‌కుడిగా, ముఖ్య‌మంత్రిగా ఎంపిక చేసిన స‌మ‌యంలో నూ నారా లోకేష్‌కు వేదిక‌పై ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. అలానే ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలోనూ.. ముందు చంద్ర‌బాబు, త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇక్క‌డ కూడా.. నారా లోకేష్‌కు కొంత మేర‌కు ప్రాధాన్యం త‌గ్గించారు. ఇక‌, ఏ శాఖ ఇస్తార‌నే విష‌యంలోనూ చ‌ర్చ సాగుతోంది. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. ఐటీశాఖ ఇస్తార‌ని అనుకున్నా.. గ‌తంలో మాదిరిగా .. నారా లోకేష్‌కు ప్రాధాన్యం చిక్క‌డం కష్ట‌మ‌నే వాద‌న స్ప‌ష్టంగా వినిపిస్తోంది.

మంచిదేనా..!
ఇలా నారా లోకేష్‌కు ప్రాధాన్యం త‌గ్గించ‌డం పై టీడీపీ నేత‌ల్లో చ‌ర్చ సాగుతోంది. ఇది మంచిదేన‌ని మెజారిటీ నాయ‌కులు చెబుతు న్నారు. పార్టీని గాడిలో పెట్ట‌డం విష‌యాన్ని పక్క‌న పెడితే.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం బ‌లంగా వేళ్లూనుకునే వ‌ర‌కు ప‌వ‌న్ కు ప్రాధాన్యం ఇవ్వ‌డం అత్యంత అవ‌స‌రంగా సీనియ‌ర్లు చెబుతున్నారు. ఆదిలోనే  ప‌వ‌న్‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. త‌న‌ను తాను త‌గ్గించుకుని వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా చంద్ర‌బాబు ఔన్న‌త్యంతోపాటు ఆయ‌న రాజ‌కీయ వ్యూహం కూడా ఫ‌లిస్తుంద‌ని అనేవారు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే నారా లోకేష్‌కు కొంత మేర‌కు బ్రేకులు వేయ‌డం ద్వారా భ‌విష్య‌త్తు కార్య‌వ్యూహం ఉంద‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: