చంద్ర బాబు: సాక్షిపై మొదటి వెటు..!

Divya
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే.. మీడియా కూడా అటు ఇటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నటు వంటి రోజులివి. మొన్నటిదాకా బ్యాలెన్స్ చూపించినటువంటి టీవీ9, ఎన్టీవీ చానల్స్ విషయానికి వచ్చేసరికి.. మొదట బ్యాలెన్స్ గా చూపించిన ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి వైసిపి కార్యకర్తలారా మారిపోయాయి. గతంలో జగన్ అధికారంలోకి వచ్చాక.. కేబుల్ ఆపరేటర్ల మీద ప్రెషర్ తెచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏబీఎన్, తర్వాత టీవీ5  వంటీ చానాల్స్ ను టార్గెట్ చేశారు. చాలాచోట్ల ఏబీఎన్, టీవీ ఫైవ్-5 ను మాత్రం ఆపించారు.

ఇప్పుడు అలాగే సాక్షి టీవీ ని , టివి -9, ఎన్టీవీ ను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆపేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు ఎవరు అధికారంలోకి వస్తే.. అటు ఆ చానల్ ను ఇటు ఈ చానల్ను సైతం నిలిపివేచే స్థితికి జారిపోయారు. వీటి ఇన్ఫాక్ట్ వల్ల రాష్ట్రంలో సాక్షి ఛానల్ రాదు. రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ట్రాయికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఏమిటంటే.. ట్రాయి రూల్స్ ప్రకారం ఒక ఛానల్ కావాలని ప్రతి కేబుల్ ఆపరేటర్ని 20% వరకు అడగాలి..

సాధారణంగా ఏమేం చానల్స్ కావాలని విషయం పైన ఒక లిస్టు ఇస్తే అందులో మనం టిక్ పెట్టిన వాటికి ఇవ్వాలి.. వాస్తవానికి ఎవరూ కూడా ఆ లిస్టును అయితే చూడరు. డబ్బులు ఇస్తే కేబుల్ ఆపరేటర్ చూస్తారు కదా అని వదిలేస్తూ ఉంటాము. దాంట్లో వారు ఇచ్చేటువంటి చానల్స్ టిక్కు పెట్టేసుకొని ట్రాయికి చూపెడుతూ ఉంటారు. దీంతో ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు సాక్షి ఛానల్ మాకు కావాలి అంటూ 20% వరకు సంతకాలు పెట్టించి కేబుల్ ఆపరేటర్ చేత ట్రాయికి అందించారు. అయినా కూడా ఇవ్వక పోతే అప్పుడు కేసు పెట్టడం జరుగుతుంది. అప్పుడు కేబుల్ ఆపరేటర్ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో సాక్షి ఛానల్ కావాలని అడుగుతారా అనే మిలియన్ డాలర్ల ప్రశ్న కూడా ఎదురవుతోంది. మరి టీవీ9, టీవీ5 పరిస్థితి ఏంటో చూడాలి.. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా చాలామంది ఆన్లైన్ ద్వారానే చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: