టీడీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్రం క‌ష్టాల్లో ఉంద‌ని త్యాగం చేశారుగా...!

RAMAKRISHNA S.S.
రాజ‌కీయాల్లో ఏ నాయ‌కుడు అయినా.. సంపాయించుకునేందుకు చూస్తారు. ఎందుకంటే ఖ‌ర్చులు కూడా అలానే ఉంటాయి. పైగా.. ఎమ్మెల్యే అంటేనే హంగు ఆర్భాటాలు త‌ప్ప‌నిస‌రి. సో.. ఎలా చూసుకున్నా.. ఎమ్మెల్యే అయ్యే నాయ‌కుల‌కు రూపాయితో నే ప‌ని ఉంటుంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌న్నా.. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల‌న్నా.. వారికి చేరువ కావాల‌న్నా.. డ‌బ్బు.. డ‌బ్బు అనే మాట త‌ప్ప‌ని స‌రి. అందుకే వారికి ఇచ్చే జీతాలు భ‌త్యాలు, ఇత‌ర అల‌వెన్సులు కూడా చాలక ఎమ్మెల్యేలు దొడ్డి దారుల్లో సంపాయించుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు త‌ర‌చుగా వినిపిస్తూ ఉంటాయి.

కానీ, తాజాగా టీడీపీ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఓ ఎమ్మెల్యే మాత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. తాను ఏడాది పాటు జీతం తీసుకోన‌ని.. పైగా ఆ సొమ్మును కూడా.. ప్ర‌జ‌ల‌కు ఖ‌ర్చు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు ఆయ‌నే తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసి తొలి విజ‌యాన్ని అందుకున్న కొలిక‌పూడి శ్రీనివాస్‌. తాజా ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ప్ర‌క‌టించారు. తాను ఎమ్మెల్యేగా అందుకునే వేత‌నం మొత్తంలో రూపాయి కూడా.. తీసుకునేది లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంద‌ని తెలిపారు.

ఆర్థికంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్ర‌బాబు చేసే ప్ర‌య‌త్నానికి తాను సాయం చేయాల‌ని బావిస్తున్న‌ట్టు కొలిక‌పూడి చెప్పారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేగా త‌ను అందుకునే ప్ర‌తి రూపాయిని కూడా.. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళంగా ఇచ్చేస్తున్న‌ట్టు తెలిపారు. ఏడాది పాటు ఇలా తన వేత‌నాన్ని ఇచ్చేందుకు మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యాన‌ని కూడా శ్రీనివాస‌రావు వెల్ల‌డించారు. ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ  ఎమ్మెల్యే చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వారు వారు సొంతంగా కొన్ని కార్య‌క్ర‌మాలు చేసి ఉండవ‌చ్చేమో కానీ.. ఇలా.. మొత్తం ఏడాది పాటు విరాళంగా ఇచ్చేసిన వారు లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, కొలిక‌పూడి శ్రీనివాస‌రావు ఆర్థిక విష‌యాల‌కు వ‌స్తే.. ఆయ‌న‌కు హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లు ఉన్నాయి. అదేవిధంగా ఐఏఎస్ అకాడ‌మీలో భాగ‌స్వామ్యం ఉంది. దీంతో ఆర్థికంగా ఆయ‌న‌కు ఇబ్బందులు లేవ‌నే అంటారు. అమ‌రావ‌తి ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్న కొలిక‌పూడి.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను పిలిచి మ‌రీ తిరువూరు టికెట్‌ను ఇచ్చారు. తొలినాళ్ల‌లో విభేదించిన త‌మ్ముళ్లు.. ఆయ‌న చొర‌వ‌తో ఏక‌మ‌య్యారు. ఫ‌లితంగా అనూహ్య‌మైన విజ‌యాన్ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: