వ‌ద్ద‌న్నా స‌రే ప‌వ‌న్‌కు మంత్రి ప‌ద‌వి ఎందుకిచ్చారు.. బాబు భ‌యం ఏంటి..?

RAMAKRISHNA S.S.
- ప‌వ‌న్ గౌర‌వం, మ‌ర్యాద కాపాడే బాధ్య‌త బాబుదే
- జ‌న‌సేన వీక్ కాకుండా చూడాల్సింది బాబేగా..!
- బాబును సీఎం చేసిన ప‌వ‌న్ కేబినెట్లో లేక‌పోతే ఎలా..?
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూట‌మిని అధికారంలోకి తేవ‌డంలో ఎంత కీల‌క పాత్ర పోషించారో చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ ముందు నుంచి త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌ద్దే వ‌ద్ద‌ని చెపుతూ వ‌స్తున్నారు. కానీ ప‌వ‌న్‌కు చంద్ర‌బాబే స్వ‌యంగా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ప‌వ‌న్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప‌వ‌న్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీల‌క‌మైన శాఖ‌ను కేటాయిస్తార‌ని తెలుస్తోంది. తాను కేబినెట్లోకి వెళ్ల‌ను అని చెప్పిన ప‌వ‌న్‌కు ఎందుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు అంటే దీని వెన‌క చంద్ర‌బాబు చాలా పేద్ద ప్లానే వేశార‌ని ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ప‌వ‌న్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే అది ఖ‌చ్చితంగా జ‌నసేన వ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తి, అస‌హ‌నానికి కార‌ణ‌మ‌వుతుంది. అదే ప‌వ‌న్‌కు డిప్యూటీ సీఎం ఇచ్చి... స్టేట్‌ను అల్లాడించే శాఖ‌కు ఆయ‌న్ను మంత్రిని చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందులోనూ ప‌వ‌న్, జ‌న‌సేన అభిమానుల‌తో పాటు ప్ర‌ధానంగా ఈ ఎన్నిక‌ల్లో కూట‌మిని నెత్తిన పెట్టుకున్న కాపు సామాజిక వ‌ర్గాన్ని సంతృప్తి ప‌ర‌చాల్సి ఉంది. ఈ విష‌యంలో ప‌వ‌న్‌కు ఏ మాత్రం త‌క్కువ జ‌రిగింద‌న్న భావ‌న వారికి క‌లిగినా అది మొద‌టికే మోసం వ‌స్తుంది.

చంద్ర‌బాబు ఆ రిస్క్ ఎంత‌మాత్రం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అందుకే ప‌వ‌న్‌ను కేబినెట్లోకి తీసుకున్నారు. ఇక ప‌వ‌న్ కేబినెట్లో ఉంటే ఈ జోష్ వేరుగా ఉంటుంది. అప్పుడే జ‌న‌సేన కేడ‌ర్‌లో ఊపు వ‌స్తుంది.. వైసీపీలో అసంతృప్తుల్లో కొంద‌రు అయినా జ‌న‌సేన వైపు చూస్తారు.. త‌ద్వారా జ‌న‌సేన మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. జ‌న‌సేన - టీడీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే వైసీపీ అంత వీక్‌గా ఉంటుంది. ఇలా జ‌రిగితేనే వైసీపీ రోజు రోజుకు మ‌రింత బల‌హీన‌ప‌డుతూ ఉంటుంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన రెండు బ‌ల‌హీనం అవ్వ‌డం.. రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయ‌డంతోనే ఈ రెండు పార్టీలు దెబ్బ‌తిని వైసీపీ బ‌ల‌ప‌డింది.. ఈ సారి జ‌న‌సేనను బ‌ల‌హీన‌ప‌డ‌కుండా కాపాడుకోవ‌డం ప‌వ‌న్ బాధ్య‌త మాత్ర‌మే కాదు.. చంద్ర‌బాబు బాధ్య‌త కూడా అందుకే ప‌వ‌న్‌ను కేబినెట్లోకి తీసుకున్నారు.

ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ప‌వ‌నే ప్ర‌భుత్వంలో లేక‌పోతే అస‌లు ఈ ప్ర‌భుత్వానికే అర్థం ఉండ‌దు. ఇవ‌న్నీ ఆలోచించే చంద్ర‌బాబు ప‌వ‌న్‌ను కేబినెట్లోకి తీసుకున్నారు.. ప‌వ‌న్ కేబినెట్లో చేరేందుకు ముందు కాస్త త‌ట‌ప‌టాయించినా బాబు మాత్రం ప‌ట్టు వీడ‌లేద‌నే చెప్పాలి. ప‌వన్‌కు ఇవ్వాల్సిన గౌర‌వం, మ‌ర్యాద ఇవ్వ‌డంతో పాటు దానిని కాపాడాల్సిన బాధ్య‌త కూడా బాబుమీదే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: