ప్ర‌మాణ స్వీకారంలో తెలుగు చ‌ద‌వ‌లేక త‌డ‌బ‌డ్డ స‌విత‌మ్మ‌, వాసంశెట్టి సుభాష్‌..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసాయి.. ఫలితాలు వెలువడ్డాయి.. ఇక ఎట్టకేలకు ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి, నూతన మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తెలుగు చదవలేక అటు సవితమ్మ ఇటు వాసంశెట్టి సుభాష్ తడబడినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తూ ఉండడం ఇంకా గమనార్హం.

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యేగా టిడిపి తరఫున పోటీ చేసిన ఎస్. సవితమ్మకు తాజాగా మంత్రి పదవి లభించింది.. మంత్రిగా ఈమె పదవి స్వీకారం కూడా చేసింది. బీసీ మహిళా కోటాలో కురబ సామాజిక వర్గానికి చెందిన సవితమ్మకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈమెకు  మంత్రిగా అవకాశం కల్పిస్తూ.. కేబినెట్లో స్థానం కల్పించారు. ఇక తాజాగా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సవితమ్మకు  అటు టిడిపి పార్టీ శ్రేణులు కురబ సామాజిక వర్గ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో సవితమ్మ తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి టిడిపి హయాంలో ఏకంగా 14 శాఖలకు మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.. ఇక ఆ కృతజ్ఞత తోనే టిడిపి తరఫున ఈమెకు కేబినెట్లో అవకాశం కల్పించారు.. కానీ తాజాగా తెలుగు చదువుతూ ఈమె తడబడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉండగా అటు వైసీపీ శ్రేణుల్లో హాస్యాన్ని తెప్పిస్తోంది. తెలుగు రాష్ట్రం.. పైగా తెలుగు చదవని వారికి మంత్రులుగా పట్టం కట్టుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి దీనిపై టిడిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
మరొకవైపు ఈమెతో పాటు తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన వాసంశెట్టి సుభాష్ కూడా తెలుగు చదవడంలో తడబడ్డారు. ఈస్ట్ గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గము నుండి ఎంపీ స్థానం కోసం బరిలోకి దిగిన వాసంశెట్టి సుభాష్ మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు.. అయితే ఈయన కూడా తెలుగు చదవడంలో తడబడినట్లు మనకు ప్రస్తుతం ప్రసారమవుతున్న లైవ్ చూస్తే అర్థమవుతుంది.. ఏది ఏమైనా ఇప్పుడు వీరిద్దరూ ఇలా తెలుగు చదవడంలో ఇబ్బంది పడడంతో పలు ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: