చంద్రన్నకు పట్టాభిషేకం.. బాబు ప్రమాణస్వీకారంతో ఏపీలో నవశకం మొదలైందిగా!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు విడుదలై కూటమిలో భాగంగా 164 సీట్లు టిడిపి పార్టీ కైవసం చేసుకుంది. దీంతో టీడీపీ నేతలు సైతం ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా  ఇటీవలే నారా చంద్రబాబు కూడా తన ప్రమాణ స్వీకారాన్ని ఈ రోజున చేశారు. టిడిపి నేతలు కార్యకర్తలు సైతం ఈ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నవ శంఖం మొదలయ్యిందని ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు.. ముఖ్యంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవి ప్రమాణం చేయించారు. కేసరపల్లి లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాన నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాతు సహా పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

వేలమంది అభిమానులతో పాటు పలువురు నేతలు కూడా ఇక్కడకు హాజరయ్యారు. విభజిత ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తన పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ని సైతం అభివృద్ధి చేస్తానని ఇప్పటివరకు ఎన్నో రకాల ఇంటర్వ్యూలలో తెలియజేయడమే కాకుండా ప్రజల మధ్య కూడా హామీలను ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకు ఈసారి పరిపాలన కత్తి మీద సాము లాంటిదని కూడా చెప్పవచ్చు.
ఎందుకంటే మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను సైతం నెరవేర్చాలి అంటే కత్తి మీద సాము లాంటిది.ముఖ్యంగా మహిళల పైన ఎక్కువగా హామీలను కురిపించారు చంద్రబాబు ఆ హామిలే తనను అధికార పట్టానికి దగ్గర చేశారని కూడా చెప్పవచ్చు. మరి ఆహామీలను నెరవేర్చి  2029 ఎన్నికలలో భాగంగా ప్రజలలో ఓటు అడగడానికి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ కూడా యువ గళం పాదయాత్రలో భాగంగా ఎన్నో హామీలను సైతం ప్రకటించారు. చంద్రబాబు విజయంలో కీలకమైన నేతగా పేరు పొందారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ లేకపోతే కచ్చితంగా టిడిపి పార్టీకి ఇంతటి విజయం చేకూరేది కాదని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: