పవన్ ప్రమాణస్వీకారానికి.. అకిరా పంచెకట్టు?

praveen
మెగా అభిమానులు జనసైనికులు ఎంతోమంది ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఏకంగా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట ఎప్పుడు వినపడుతుందా అని చుసిన ఫ్యాన్స్ కు ఇక ఇటీవల అందరికీ గూస్ బంప్స్ వచ్చేసాయ్.  పవన్ కళ్యాణ్ ఈ మాట చెబుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు   అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చి.. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట చెప్పగానే ఇక సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది.

 ఈ అయితే పవన్ కళ్యాణ్ స్వీకారానికి అటు భార్య అన్నా లిజనోవాతో పాటు ఇక కొడుకు అకీరా కూడా వచ్చారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా భార్య అన్నా లేజనోవా ఏకంగా ఈ మధురమైన క్షణాన్ని తన మొబైల్ లో బంధించింది. ఏకంగా పవన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా మొబైల్లో వీడియో తీసింది. అయితే ఇక ఇలా పవన్ ప్రమాణోత్సవ కార్యక్రమానికి వచ్చిన అకీరా ఏకంగా పంచకట్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు అని చెప్పాలి. మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని ఇక తెల్ల పంచ కట్టుకొని తన తండ్రి మధురమైన క్షణాన్ని తాను కూడా ఆస్వాదించేందుకు వచ్చారు అకీరా.

 ఇలా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా పంచకట్టులో వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అకీరానందన్ తో పాటు ఇక పవన్ కూతురు ఆధ్యా కూడా వచ్చింది.  అకీరా పంచకట్టులో అచ్చు తెలుగు కుర్రాడిలా కనిపించడం చూసి అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు. అయితే ఇప్పటికే ఈ వేడుకకు అటు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి హాజరవ్వగా అటు కొణిదల రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వీళ్ళు మాత్రమే కాదు మెగా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: