చంద్రబాబు పట్టాభిషేక మహోత్సవం: దేశం దృష్టి బాబు పైనే.. బాబూనా మజాకా..!

Divya
•చంద్రబాబు ప్రమాణ స్వీకారం..
•సినీ ప్రముఖులతో పాటు ప్రధాన మంత్రి కూడా అతిథిగా..
* చంద్రబాబా.. మజాకా..

(అమరావతి - ఇండియా హెరాల్డ్)
మరి కొన్ని నిమిషాలలో అనగా 11:27 నిమిషాలకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేతుల్లోకి తీసుకోబోతున్నారు.. నారా చంద్రబాబు అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోందనే చెప్పాలి.. దీనికి కారణం ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి ప్రత్యేక అతిధిగా రావడమే... తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా పదవి స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అటు సినీ ప్రముఖులు ఇటు రాజకీయ నేతలు కూడా హాజరు కాబోతున్నారు. మరొకవైపు ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ కూడా రాబోతుండడంతో దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తూ ఉండడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. నిజానికి నరేంద్ర మోడీ ఒక్క నార్త్ ఇండియా పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు.. సౌత్ పైన ఆయన దృష్టి చాలా తక్కువ అని చెప్పాలి..

పైగా కూటమి ఓడిపోతుందని అందరూ అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఆంధ్రప్రదేశ్లో తలపించిన ఎన్నికలు ఏ రాష్ట్రంలోనూ జరగలేదనే చెప్పాలి.. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రాలో ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ గా ఎదురు చూశారు.. కొట్లాటలు,  గొడవలు, చంపుకోవడాలు అన్నీ ఇక్కడే అన్నట్టుగా ఒక సినిమాను తలపించాయి.. ఆంధ్ర ఎన్నికలు ఇక ముగిసాయి.. ఆంధ్రప్రదేశ్లోకి కూటమి అధికారంలోకి మరికొన్ని క్షణాలలో రాబోతోంది.. ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు.. అందుకే దేశం మొత్తం బాబు పైనే దృష్టి పెట్టడం గమనార్హం. పైన చంద్రబాబు ఇక్కడ కమలం యొక్క బలాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. పైగా బాబు సన్నిహిత్యం కూడా ఇక్కడ ప్రధాన కారణమని చెప్పాలి.

నిజానికీ ఈసారి చంద్రబాబుకి లైఫ్ అండ్ డెత్ గా మారాయి ఈ ఎన్నికలు.. అందుకే కూటమితో పొత్తు పెట్టుకుని విజయాన్ని సాధించారు.. మళ్లీ తిరుగు లేదని నిరూపించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు నాలుగున్నర సంవత్సరాల లో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవడం సిగ్గుచేటనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఒక సాధారణ ప్రాంతంగా ఉన్న అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తానని చంద్రబాబు భీష్మించుకు కూర్చున్నారు.  అందుకే ఇప్పుడు అమరావతి నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. అమరావతిని ఎవరు చూడని ఎన్నడూ చూడని విధంగా మారుస్తారని అందరూ భావిస్తున్నారు మరి చంద్రబాబు ఈ విషయంపై ఎలాంటి సత్తా చాటుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: