ఏపీ: మంత్రివర్గంలో సీనియర్లకు దక్కని చోటు.. విరే..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా కూటమిలో భాగంగా టిడిపి 164 సీట్లను కైవసం చేసుకుంది.. చంద్రబాబు నాయుడు ఈ రోజున ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈసారి తన క్యాబినెట్లోకి 18 మందికి మాత్రమే స్థానం కల్పించినట్లుగా తెలుస్తోంది. అందులో 10 మంది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే ఉండడం గమనార్హం. గెలిచిన వారిలో కొంతమంది సీనియర్లు మంత్రి పదవులు ఆశించిన ఆ నేతలకు నిరాశ మిగిలినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అలా నిరాశలో ఉన్నటువంటి నేతల విషయానికి వస్తే..

ముందుగా బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, గంటా శ్రీనివాసరావు, బోండా ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ,జివి ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీ కూడా ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అలాగే వీరితోపాటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి రాష్ట్రంలోని భారీ మెజారిటీతో గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావుకు కూడా ఎలాంటి అవకాశం దక్కలేదు. దీంతో చాలామంది టీడీపీ నేతలు నిరాశతో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జనసేన నేతలకు బిజెపి నేతలకు కూడా పదవులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

కూటమి సహాయంతోనే చాలామంది నేతలు గెలిచారు. కానీ పదవుల విషయానికి వచ్చేసరికి అందరూ కావాలని ఆలోచిస్తూ ఉండడంతో చాలామంది నేతలు నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో నైనా సీనియర్లకు అవకాశం ఇస్తారేమో చూడాలి.. ముఖ్యంగా చంద్రబాబు కూటమి తరపున మేనిఫెస్టోని ప్రకటించారు ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ తన మొదటి సంతకం ఈరోజు చేయబోతున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు. ఈసారి చంద్రబాబు నాయుడు బాధ్యత చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా తన చెప్పిన హామీలను సైతం ప్రవేశపెట్టడం పైన కూడా ఆచితూచి అడుగులు వేయాలి అలాగే అభివృద్ధి చేయడమే కాకుండా ఉద్యోగ లక్షణంతో కూడా ముందుకు వెళ్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: