గ్రేట్.. సర్పంచ్ సీఎం అయ్యాడు?

praveen
సాధారణంగా ఒక గ్రామానికి సర్పంచిగా పనిచేసిన వ్యక్తి.. ఇక రాజకీయ ప్రస్థానంలో ఎంతవరకు వెళ్ళగలరు. మహా అయితే ఎమ్మెల్యే వరకు వెళ్లగలరు. అదృష్టం కలిసి వస్తే మంత్రి పదవి కూడా చేపట్టగలరు అని చెబుతారు. కానీ ఇలా సర్పంచ్ స్థాయి నుంచి ఎవరైనా సీఎం అయ్యే స్థాయికి ఎదుగుతారా అంటే అది అసాధ్యమని అంటారు ఎవరైనా. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు  ఆయన పేరే మోహన్ చరణ్ మాంఝి. సర్పంచిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన   ఇక ఇప్పుడు ఒడిశాకు 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు  

 మోహన్ చరణ్ మాంఝి 1972 జనవరి 6వ తేదీన ఒడిశా లోని కీయంజోర్  లో జన్మించారు.  అయితే అతను షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. కాగా డాక్టర్ ప్రియాంక మారాండిని వివాహం చేసుకున్నారు. 1997 -  2018 రాయికల్ గ్రామ సర్పంచిగా ఎన్నికై ఆయన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత 2000 సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే విజయాన్ని సాధించగలిగారు. ఆ తర్వాత మోహన్ చరణ్ ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శిగా కూడా పనిచేశారు. తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ గా కూడా ఆయన సేవలు అందించారు.

 అయితే కియోంజర్ నియోజకవర్గ నుంచి 2004, 2019, 2024 లోను ఆయన వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూనే వచ్చారు. ఒడిశాలో గిరిధర్ గమాంగ్, హేమానంద బిశ్వనాథ్ తర్వాత మూడవ ఆదివాసి సీఎంగా రికార్డు సృష్టించారు. ఇక ఎప్పుడూ 24 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత 2024లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు ఇక ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంఝిని ఎంపిక చేసింది బిజెపి  ఈ క్రమంలోనే ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎం ఫార్ములాను బీజేపీ ఒడిశాలో అమలు చేసింది. అయితే ఇలా సర్పంచ్ నుంచి సీఎం వరకు ఎదిగిన మోహన్ చరణ్ మాంఝి రాజకీయ ప్రస్థానం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: