అతనో సైకిల్ మెకానిక్.. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు?

praveen
కేంద్రంలో మోడీ హ్యాట్రిక్ కొట్టేశారు. కేవలం జవహర్లాల్ నెహ్రూ కి మాత్రమే సాధ్యమైన రికార్డును మోడీ కూడా సాధించారు  అయితే 400 సీట్లు గెలిచి అఖండ విజయాన్ని అందుకుంటాము అనుకున్నప్పటికీ   ఇక మోడీ అంచనా తారుమారు అయింది. ఏకంగా బిజెపి బలంగా ఉన్న రాష్ట్రాలలో సైతం ఇక ఆ పార్టీకి సీట్లు తగ్గాయి అని చెప్పాలి. అయినప్పటికీ మిగతా పార్టీల మద్దతుతో చివరికి మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు.

 మోడీ ప్రమాణస్వీకారం చేయడం మాత్రమే కాదు కేంద్ర క్యాబినెట్లో మంత్రులుగా బాధ్యతలను నిర్వర్తించబోయే పార్లమెంట్ సభ్యులు కూడా ఇక ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పాలి  ఈ క్రమంలోనే ఇలా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి రాజకీయ ప్రస్థానం ఏంటి అన్న విషయం గురించి తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఒక నాయకుడి ప్రస్థానం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఏకంగా సైకిల్ మెకానిక్ స్థాయి నుంచి సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగారు ఆయన.

 ఆయన ఎవరో కాదు వీరేంద్ర కుమార్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరేంద్ర కుమార్. కటిక్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన చిన్న తనంలో సైకిల్ రిపేర్ షాప్ లో తన తండ్రితో కలిసి పనిచేసేవారు. తమ  దగ్గరికి రిపేరు కోసం వచ్చిన సైకిళ్ళకు పంచర్లు వేస్తూ ఉండేవారు. అయితే ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. దళిత వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే గ్రాడ్యుయేషన్, బాల కార్మికులపై పిహెచ్డి చేసిన వీరేంద్ర కుమార్ రాజకీయాలపై ఆసక్తితో అటువైపుగా అడుగులు వేశారు. 1996లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన ఆయన.. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాను సాధారణ కుటుంబ వ్యక్తిని.. తన జీవనశైలి ఇప్పటికీ సాధారణంగా ఉంటుందని వీరేంద్ర కుమార్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cm

సంబంధిత వార్తలు: