సీఎం అయ్యాక.. రేవంత్ చేసిందే.. చంద్రబాబు చేయబోతున్నారట?

praveen
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఏకంగా 161 స్థానంలో విజయ డంకా మోగించి ప్రతిపక్షమే లేకుండా గ్రాండ్ విక్టరీని అందుకుంది. ఈ క్రమంలోనే నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతుండగా అటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.

 అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే సీఎం గా అటు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ముందుగా.. ఎలాంటి హామీలు అమలుఫై సంతకం చేయబోతున్నారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే సీఎం అయ్యాక  తన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినదే  చంద్రబాబు కూడా చేయబోతున్నాడు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం గా రేవంత్ బాధ్యతలు చేపట్టారు.

 ఈ క్రమంలోనే తాము మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగానే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. మహాలక్ష్మి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే ఇక ఇప్పుడు తన శిష్యుడైన రేవంత్ అమలు చేసిన పథకాన్నే గురువు చంద్రబాబు కూడా అమలు చేయబోతున్నాడట. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పథక అమలు తీరును పరిశీలించి నివేదిక సిద్ధం చేశారట. ఇక తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందని భావిస్తున్నారట. ఇక కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా.. ఉమ్మడి జిల్లాల పరిధికి ఇస్తారా లేదా రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా అన్నది ఇక చంద్రబాబు నిర్ణయించబోతున్నారు. కాగా ఈ పథకం అమలుతో ఏపీఎస్ఆర్టీసీకి నెలకి 200 కోట్ల రాబడి తగ్గుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: