పవన్: ఎమ్మెల్యేల సమావేశంలో కీలక వ్యాఖ్యలు..!

Divya
జనసేన పార్టీ అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తోంది.పాతతరం రాజకీయాలకు కాలం చెల్లింది అంటు జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలను కూడా ఇచ్చారు. గతంలో మాదిరి కూర్చొని పవర్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అసలు కుదరదని ప్రజలు మనకు చాలా బాధ్యత ఇచ్చారు. వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు.. ఏదైనా సందర్భంలో వారు మాట అంటే భరించాల్సి ఉంటుంది. ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు అసలు చేయొద్దు అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఏపీ ఎన్నికలలో టిడిపి పార్టీ కూటమిగా అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ పాత చాలా కీలకమైందని కూడా చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదంటూ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పొత్తును ప్రకటించారు.. ఈ సమయంలోనే వైసీపీ పార్టీని రెండవసారి గెలవనివ్వకుండా చేయాలని అనుకున్న పవన్ కళ్యాణ్ అలాగే చేశారు. టిడిపి బిజెపి పార్టీలు కలవడంతో చాలా కీలకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కూటమిగా ఏర్పడి ఎన్నికల ప్రచారంలో పలు వ్యాఖ్యలు కూడా చేస్తూ వైసిపి ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు.

అలా ఎన్నో రకాలుగా హామీలను ఇస్తూ..ప్రజలకి అండగా తను ఉంటానని ఎలాంటి విషయాన్నైనా సరే నెరవేర్చతములో ఉందంటూ తెలియజేశారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీలను నేతలను కూడా ప్రచారం చేయించారు. దాదాపుగా 70 వేలకు పైగా మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలు రుణపడి ఉంటానని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు దేశంలోనే పిఠాపురం ఎమ్మెల్యే చేసే పని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అంటూ కూడా తెలియజేశారు. ఇదంతా ఇలా ఉంటే చంద్రబాబు క్యాబినెట్లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వ్యవహరించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: