బాబు ప్రమాణ స్వీకారం: జగన్ కు షాక్..7గురు ఎమ్మెల్యేలు జంపేనా.?

Pandrala Sravanthi
గర్వము, అహంకారం అన్ని రోజులు పని చేయవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే అర్థమవుతుంది. వారు పాలించింది ఒకే టర్మ్ అయినా సరే  విచ్చలవిడిగా ప్రవర్తించారు.  సహనాన్ని కోల్పోయారు. ఇక మేమే రాష్ట్రాన్ని శాసించే నాయకులమని విర్రవీగిపోయారు. ఎదుటి వ్యక్తులను చాలా చులకన చేసి మాట్లాడారు. చివరికి ప్రజల చేతిలో చీమల్లాగా నలిపించుకోబడ్డారు. వై నాట్ 175 అనే నినాదంతో తగ్గేదే లే అంటూ ఎన్నో డైలాగులు విసిరారు.  చివరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. టిడిపి కూటమి చేతిలో దారుణంగా ఓటమిపాలయ్యారు. కట్ చేస్తే జూన్ 4 నుంచి ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. 

వైసీపీలో హేమాహేమీలంతా సైలెంట్ అయిపోయారు.  రాష్ట్ర విభజన తర్వాత రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి టిడిపి నుంచి చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే తరుణంలో అనుకోని షాక్ వైసిపికి తగలనుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.  ముక్కి మూలిగి 11 సీట్లు సాధించినటువంటి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం  తర్వాత దాదాపుగా ఏడుగురు ఎమ్మెల్యేలు టిడిపి పంచన చేరుతున్నట్టు తెలుస్తోంది. వారు జూన్ 4 నుంచే టిడిపి అధిష్టానానికి టచ్ లోకి వచ్చినట్టు  సమాచారం.  

వారు ఎవరు ఏంటి అనేది గోప్యంగా ఉంది కానీ, వారు తప్పకుండా టిడిపి పంచన చేరుతారట. కొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకోగా మరి కొంతమంది బిజెపిలో చేరతారని తెలుస్తోంది. ఈ రెండు పార్టీల్లో ఎందులో చేరిన వారు కూటమిలోకి వెళ్లిపోయినట్టే. అయితే ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ కు దూరమైనట్టు తెలుస్తోంది.  ఇప్పటికే 11 సీట్ల పరిమితమై ఏడుస్తున్నటువంటి జగన్ కు వీరు మరో షాక్ ఇస్తే జగన్ పరిస్థితి ఏంటో అని వైసిపి క్యాడర్ అంతా భయపడిపోతుందట. ఇక పాలన మొదలవ్వకముందే ఏడుగురు జంప్ అయితే,  ఇక చంద్రబాబు పాలన మొదలు పెట్టిన తర్వాత అసలు వైసిపి  ఎమ్మెల్యేలు ఉంటారా, పూర్తిగా ఖాళీ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి రాబోవు రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది  తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: