జగన్ కు ఫోన్ చేసిన చంద్రబాబు.. ఏం మాట్లాడుకున్నారంటే?

praveen
మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు టిడిపి, జనసేన, బిజెపి పార్టీలతో కూడిన కూటమి ఎంత అఖండ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 161 స్థానాలలో కూటమి ఘనవిజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇక రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

 రేపు ఉదయం 11 :  27 గంటలకి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ఉండబోతుంది అని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న చిరంజీవి హాజరు కాబోతున్నారు  ఇటీవలే ఆయనకు విశిష్ట అతిథిగా హాజరుకావాలని ఇక ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. అయితే ఇక ఇదే కార్యక్రమానికి అటు చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. మరోవైపు అటు ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారట. అదే సమయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక ఈ కార్యక్రమానికి రాబోతున్నారట.

 ఇదిలా ఉంటే.. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏకంగా వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టిడిపి చీప్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి జగన్ ను ఆహ్వానించాలని అనుకున్నారట. కానీ ఇక చంద్రబాబు ఫోన్ కి  జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. ఎందుకంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని అటు వైసిపి నిర్ణయించుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే కాదు ఇక కూటములోని కీలక నేతలందరూ కూడా మంత్రి పదవిలు కట్టబెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: