ఏపీ: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి..!

Divya
రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.11: 27 నిమిషాలకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది సెలబ్రిటీలు నాయకులు వ్యాపారవేత్తలు కూడా రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేసరపల్లి ఐటి పార్కు దగ్గర చంద్రబాబు ప్రమాణస్వీకారం చాలా గ్రాండ్గా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 12 ఎకరాలలో సభా ప్రాంగణ ఉండబోతుందని ఇందులో మూడు ఎకరాలలో సభా వేదిక ఏర్పాటు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా వీవీఐపీలు విఐపిలతో పాటు నేతలు ప్రజల కోసం 36 గ్యాలరీలు సిద్ధం చేసినట్లుగా సమాచారం అలాగే 7000 మంది పోలీసులతో భారీ భద్రత నడుమున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు.. ఆ ఏరియాలోని అన్ని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రేపు చెన్నై కోల్కతా జాతీయ రహదారి పైన ట్రాఫిక్ ను కూడా మళ్లించినట్లు సమాచారం. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. స్టేట్ గెస్ట్ గా చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తొంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల కు స్పెషల్ ఫ్లైట్లో చిరంజీవి విజయవాడకు వెళ్ళబోతున్నట్లు సమాచారం. అలాగే మోడీ కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రేపు ఉదయం 10:40 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో చిరంజీవి చేరుకోబోతున్నారని.. మోదీ 10:55 నిమిషాలకు కేసరపల్లి దగ్గర ఐటీ పార్కుకి చేరుకోబోతున్నారు. ఉదయం 11 :27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. అలాగే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి మోడీతో పాటు అమిత్ షా తో సహా కేంద్ర మంత్రులు కూడా హాజరవుబోతున్నట్లు సమాచారం ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకే మోదీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి చిరంజీవి వస్తారో రారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: