చంద్ర‌బాబు: మినిమం క‌ష్టం - మాగ్జిమ‌మ్ రిజ‌ల్ట్

RAMAKRISHNA S.S.
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
నాయ‌కుడిగా ఉన్న వ్య‌క్తి.. చేయించ‌డానికే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాడు. గ‌త ఐదేళ్ల కాలంలో ఏపీ ఈ ప‌రిణామా ల‌ను చూసింది. అయితే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. మాత్రం తాను చేస్తూ.. త‌న వారితో చేయిస్తూ.. ముందుకు సాగ‌డం అనేది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అది పార్టీ అయినా.. ప్ర‌బుత్వ‌మైనా.. చంద్ర‌బాబు స్ట‌యిలే వేరు. `చంద్ర‌బాబు ఒక ప‌ట్టాన మెచ్చుకోరు. ఆయ‌న మెప్పు పొందామంటే.. మా జ‌న్మ ధ‌న్యం` అని టీడీపీలో ఉన్న సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు చెప్పే మాట ఇది.

ఇది వాస్త‌వం కూడా. రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డ‌డం.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి పైన‌ల్ ప‌రీక్ష‌కు సిద్ధ‌మైన‌ట్టుగా .. పాల‌న వ్య‌వ‌హారాల‌ను నిరంత‌రం స‌మీక్షించ‌డం ప్ర‌భుత్వం ప‌రంగా చంద్ర‌బాబుకు తెచ్చిన స్టేట్ ర్యాంకు అయితే.. పార్టీలోనూ అదే విధానం ఆయ‌న అవ‌లంభించారు. పార్టీలో ఎవ‌రు ప‌నిచేస్తున్నారు?  ఎవ‌రు బద్ధ‌కిస్టులుగా ప‌రాన్న జీవులుగా మారారో తెలుసుకుని.. వారిని వ‌దిలించుకోవ‌డం కాదు.. వారితో ప‌నిచేయించుకోవ‌డం తెలిసిన నాయ‌కుడు చంద్ర‌బాబు.

సాధార‌ణంగా ఏ రంగంలో అయినా.. మినిమం క‌ష్టం - మాగ్జిమ‌మ్ రిజ‌ల్ట్ అనే ఫార్ములాను వినియోగిస్తారు. కానీ, చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. మాగ్జిమ‌మ్ క‌ష్టం-డబుల్ మాగ్జిమ‌మ్ రిజ‌ల్ట్ ఫార్ములానే ఫాలో అవుతా రు. ఎవ‌రైనా ఇలాంటివి వింటే.. సాధ్య‌మా? అనే సందేహం వ‌స్తుంది. అందుకే చంద్ర‌బాబు ముందుగా తానే చేసి చూపిస్తారు. త‌ర్వాత.. త‌న‌లాగానే క‌ష్ట‌ప‌డాల‌ని చెబుతారు. గ‌తంలో చేప‌ట్టిన ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న స‌మ‌యంలో ఉదయం 6 గంట‌ల‌కే ఆఫీసుకు రావ‌డం అల‌వ‌రుచుకున్నారు.

ఓ సంద‌ర్భంలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వంటివారు.. స‌ర్దిచెప్పి.. `` మీరు రాగ‌ల‌రు. పాపం వాళ్ల‌కు ఇబ్బం దులు ఉన్నాయి. ఆ స‌మ‌యానికి రాలేరు`` అని చెప్పి.. దానిని 7 నుంచి 8 గంట‌ల‌కు మార్చారు. అయిన ప్ప‌టికీ.. చంద్ర‌బాబు త‌న తీరును మార్చుకోలేదు. కాక‌పోతే.. అది త‌న వ‌ర‌కే ప‌రిమితం చేశారు. ఏదైనా ఫైలు ప‌రిష్క‌రించాల్సి వ‌చ్చినా.. ఆసాంతం చ‌దివిన త‌ర్వాతే ఆయ‌న సంత‌కం పెడ‌తారు త‌ప్ప‌.. గుడ్డిగా సంత‌కం పెట్టి.. అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డం అనేది చంద్ర‌బాబు నైజానికి విరుద్ధం. త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకోరు. అలానే.. ఎదుటి వారు త‌ప్పు చేస్తే స‌హించ‌రు. ఇదీ.. చంద్ర‌బాబుకు పెద్ద ఆస్తి!  ప‌నితీరులో మెరుగైన పురోగ‌తి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: