నిత్య చైత‌న్య శీలి.. నిత్య ఔన్న‌త్య ధీశాలి.. చంద్ర‌బాబు ఒక ట్రేడ్ మార్క్‌..!

RAMAKRISHNA S.S.
- నారా కాదు నిత్య చైతన్యమే బాబు ఇంటి పేరు
- బాబు ధీర‌త్వానికి నిద‌ర్శ‌నం 2024 విక్ట‌రీ
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
`వ‌య‌సు పైబ‌డింది.. ఇప్పుడు నావ‌ల్ల‌కాదు` - ఇదీ.. చాలా మంది నాయ‌కుల నుంచి వినిపించే మాట‌. గ‌త ఐదేళ్ల‌లో ఓ మంత్రి ఉండేవారు. ఆయ‌న త‌ర‌చుగా ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. `ఇప్పుడునాకు చెప్పి ఏం లాభం. అదేదో ఆ ఐఏఎస్‌కు చెప్పు` అని అనేవారు. త‌ద్వారా.. తాను వ‌య‌సైపోయిన నాయ‌కుడిన‌ని చెప్పుకొచ్చారు. అయితే.. రాజ‌కీయాల నుంచి మాత్రం త‌ప్పుకొనేవారు కాదు. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. వ‌య‌సు ఒక మార్కు అంతే! ఇది ఆయ‌నే చెప్పుకొన్నారు.

నిత్య చైత‌న్యంగా ఉండ‌డం రాజ‌కీయాల్లో పెద్ద విష‌యం. ఎందుకంటే.. అనేక స‌మ‌స్య‌లు వారిని చుట్టు ముడ‌తాయి. ఒక స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించే స‌మ‌యానికి మ‌రో స‌మ‌స్య తెర‌మీదికి వ‌స్తుంది. దీంతో నిత్యం చైత‌న్యం ఉండేందుకు ప్ర‌య‌త్నించినా.. అది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి ఉండ‌డం క‌ష్టం. కానీ, టీడీపీ అధినేత విష‌యంలో మాత్రం నిత్య చైత‌న్యం ఆయ‌న ఇంటి పేరుగా మారిపోయింది. అది అధికారంలో  ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. చంద్ర‌బాబుకు మాత్ర‌మే సాధ్య‌మైంది.

`అబ్బా.. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉంది. ఇప్పుడే ఎందుకు?` అని బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంపై కొంద‌రు త‌మ్ముళ్లు చేసిన కామెంట్లు పార్టీలో చ‌ర్చ‌కు దారితీశాయి. ఇది వాస్త‌వ‌మేన‌ని మెజారిటీ నాయ‌కు లు చెప్పుకొచ్చారు. దీనికి చంద్ర‌బాబు స్ట్రాంగ్ రిప్ల‌యి ఇచ్చారు. `అయితే స‌రే.. నేను ఒక్క‌డినే అయినా.. రోడ్డెక్కుతాను. ఇక‌, మీ ఇష్టం` అంటూ.. ఆయ‌న బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టి.. విజ‌య వాడలో నిరాహార దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. నిజానికి ఆ కార్య‌క్ర‌మంలో తొలి రోజు అత్యంత త‌క్కువ మంది హాజ‌ర‌య్యారు.

కానీ, చంద్ర‌బాబు చైత‌న్యం ముందు.. త‌మ్ముళ్ల పంతం వీగిపోయింది. త‌దుప‌రి రోజు నుంచి విజ‌య‌వాడ లో ఎటు చూసినా.. ప‌సుపు జెండాలే.. ఎక్క‌డ విన్నా త‌మ్ముళ్ల నినాదాలే. ఇదొక మ‌చ్చుతునక మాత్ర‌మే. అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని మ‌హోన్న‌తంగా తీర్చిదిద్ద‌డంలోనూ చంద్ర‌బాబు తెరవెనుక ఉన్నారు. స‌మ‌స్య ఏదైనా.. దాని వెనుక చంద్ర‌బాబు నిల‌బడ్డారు. ఇదొక నిత్య చైత‌న్యం. త‌మ్ముళ్ల‌ను గాడిలో పెట్ట‌డ‌మే.. కాదు.. ముందు తాను న‌డుస్తూ.. త‌మ్ముళ్ల‌ను న‌డిపించారు.

ఇక‌, పాల‌న ప‌రంగా.. త‌న విజ‌న్‌ను న‌డిపిస్తూ.. రాష్ట్రాన్ని ప‌రుగులు పెట్టించారు. ఆ చైత‌న్య‌మే.. చంద్ర‌బాబు మ‌హోన్న‌త ధీశాలి అనేలా చేసింది. అరెస్టు నుంచి విడుద‌ల వ‌ర‌కు.. పొత్తుల నుంచి అధికారంలోకి వ‌చ్చే వర‌కు.. నిప్పు క‌ణిక‌లా ర‌గిలిపోయిన చంద్ర‌బాబు చైత‌న్యం.. నేడు ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు దారి తీసింది. ఇదేమీ స్వ‌ల్ప విజ‌యం కాదు.. దీనిని ఓట్లు.. సీట్ల‌తో పోల్చ‌ద‌గ్గ ప‌రిస్థితి కూడా లేదు. ఒక చైత‌న్యం.. ఒక ధీర‌త్వం.. వెర‌సి ద‌క్కించుకున్న మ‌హోన్న‌త విజ‌యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: