ప్లాన్ ప్రకారమే.. రేవంత్ మీదుకు బాబు, పవన్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకుంది. చాలామంది నేతలు ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు అనే విషయం గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. గతంలో టిడిపిలో చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరి తెలంగాణలో సీఎం అయ్యారు. ఈ బంధానికి రాజకీయం అతిపెద్ద అడ్డుగా మారుతున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్కి చెక్ పెట్టాలని బిజెపి పార్టీ ఎక్కువగా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో 8 అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని బిజెపి తాజాగా ఎన్నికలలో 8 ఎంపీ స్థానాలను కూడా సంపాదించుకుంది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీలో జెండా పాతాలని బిజెపి పార్టీ చాలా గట్టిగానే కోరుకుంటోందట. కచ్చితంగా ఈ పని జరగాలి అంటే కాంగ్రెస్ మీదకు దూకుడుగా వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయాలి ఇక రానన్న రోజుల్లో అందుకు తగ్గ రాజకీయ ప్రణాళికలను సైతం బిజెపి పార్టీ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలంగాణలో తొందర్లోని స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయట. గ్రేటర్ హైదరాబాద్ ని బిజెపి ఇప్పుడు లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.

గత ఎన్నికలలో 44 మంది కార్పొరేట్లను సాధించిన బిజెపి పార్టీ ఈసారి ఏకంగా మేయర్ పీఠాన్ని ఎసరు పెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకు టిడిపి జనసేన మద్దతు కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద మద్దతు ఉన్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి లక్షలాదిమంది ఓటు వేసిన నేపథ్యం కూడా కలిగి ఉన్నది. అలా రాజకీయ సామాజికపరంగా బలమైన పునాదులు టిడిపిలో ఇక్కడ కలిగే ఉన్నాయి. టిడిపి తో పొత్తు పెట్టుకోవడానికి బిజెపి తెలంగాణలో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. జనసేనతో పొత్తు పెట్టుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బిజెపి పార్టీ పోటీ చేసి విజయాన్ని అందుకోవడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే.. రేవంత్ రెడ్డికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెక్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: