చంద్ర‌బాబు - హ‌రికృష్ణ మ‌ధ్య ఓ గొడ‌వ‌... అంత‌కు మించిన ప్రేమ‌..!

RAMAKRISHNA S.S.
- ఎన్టీఆర్ కుమారుడికి ర‌వాణా శాఖా మంత్రి ఇచ్చి గౌర‌విచ్చిన బాబు
- బాబుతో విబేధించి అన్న టీడీపీ పెట్టిన హ‌రికృష్ణ‌
- చెంత చేర్చుకుని రాజ్య‌స‌భ సీటిచ్చిన వైనం
( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )
అది చిన్న‌దైనా.. పెద్ద‌దైనా స‌మ‌స్య స‌మ‌స్యే! ముందుకు వెళ్లాలంటే భ‌యం.. వెన‌క్కి త‌గ్గాలంటే భ‌యం... మ‌రి ఏం చేయాలి?  ఇలాంటి అనేక స‌మ‌స్య‌లు వ్య‌క్తిగ‌త జీవితంలో ఎలా ఉన్నా.. ఒక రాష్ట్రంలో పార్టీని న‌డిపించే స‌మ‌యంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం అంత తేలిక‌కాదు. 1997లో చంద్రబా బుకు ఇదే స‌మ‌స్య వ‌చ్చింది. అప్ప‌ట్లో చంద్ర‌బాబు కేబినెట్లో ర‌వాణా శాఖ మంత్రిగా అన్న‌గారి పెద్ద‌కుమా రుడు హ‌రికృష్ణ ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్నారు. కార‌ణాలు ఏవైనా.. ఆయ‌న ప‌నితీరుపై బాబుకు అసంతృప్తి పెరిగింది.

కేబినెట్ మంత్రులు కూడా ఇదే చెప్పారు. అలాగ‌ని ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్ట‌లేరు. హెచ్చ‌రించ‌నూ లేరు. దీంతో త‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి.. అప్ప‌టి ప్రైవేటు ఆప‌రేట‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేలా.. నిర్ణ‌యం తీసుకు న్నారు. ఇది పెను దుమారానికి దారి తీసింది. త‌న శాఖ‌లో నేరుగా వేలు పెట్ట‌డాన్ని హ‌రికృష్ణ జీర్ణించుకో లేక పోయారు. దీంతో హ‌రికృష్ణ బ‌య‌ట‌కు వ‌చ్చారు. అంతేకాదు.. సొంత‌గా పార్టీ పెట్టారు. అన్న టీడీపీ పేరుతో ఆయ‌న పార్టీని స్థాపించారు. అంత‌కాదు.. అన్న‌గారి అభిమానం ఉన్న వారంతా వ‌చ్చేయాల‌ని పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా హ‌రికృష్ణ ప‌ర్య‌ట‌న‌లు కూడా చేశారు. దీంతో టీడీపీలో పెద్ద క‌ల‌క‌లం. ఆయ‌న వెంట ఎవ రు వెళ్తున్నారు?  చంద్ర‌బాబుతో ఎవ‌రు ఉంటున్నార‌నే చ‌ర్చ వ‌చ్చింది. ఇలాంటి స‌మ‌యంలోనే చం ద్ర‌బాబు పెద్ద స‌వాల్‌తోపాటు.. స‌వాళ్ల‌ను కూడా ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. కానీ, ఆయ‌న ఎక్క‌డా చెక్కు చెదరలేదు. త‌న విజ్ఞ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. కీల‌క నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. పార్టీలో క‌ట్టుదిట్ట మైన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ విజ‌యాల‌ను ఆయ‌న ప్ర‌చారంలోకి తీసు కువ‌చ్చారు. ఇది చంద్ర‌బాబుకు ఎంతో ప్ర‌యోజ‌నంగా మారింది.

హ‌రికృష్ణ వెంట వెళ్లిన వారిలోనూ ఒక భ‌యాన్ని క‌లిగించేలా చేశారు. ఇది బెదిరింపు కాదు.. తాము హ‌రికృష్ణ వెంటే ఉంటే.. త‌మ భ‌విష్య‌త్తు ఎలా మారుతుందో? అనే ప్ర‌శ్న వారిలోనే ఉద‌యించేలా చేశారు. ఫ‌లితంగా.. నాడు అన్న తెలుగు దేశం పార్టీ విఫ‌ల‌మైంది. చివ‌ర‌కు హ‌రికృష్ణ మ‌ళ్లీ చంద్ర‌బాబు చెంత‌కు చేరుకున్నారు. త‌న‌ను ఎదిరించి.. పార్టీ పెట్టి.. ఎదురు తిరిగిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు వాటిని ప‌ట్టించుకోకుం డా.. హ‌రికృష్ణ‌కు రాజ్య‌స‌భ సీటు ఇచ్చి.. గౌర‌వించారు. ఇది.. త‌ర్వాత కాలంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. చంద్ర‌బాబు నిశిత రాజ‌కీయాలు.. ఇత‌ర నేత‌ల‌కు కూడా దిక్సూచి అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: