కాంగ్రెస్ లో ఉన్నప్పుడు.. ఆ ఏజ్ లోనే చంద్రబాబుకు మంత్రి పదవి?

praveen
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలతో కూడిన కూటమి అఖండ విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరగబోతుంది అని చెప్పాలి. ఎంతోమంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా.. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాబోతున్నారు. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 అయితే సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని రాజకీయ ఉద్దండడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అపారమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఇక ఆయన విజయం ముందు ఎంతటి రాజకీయ నాయకుడైన దిగదుడుపే అనే విధంగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున పోరాటం చేశారు   ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు సీఎంగా సేవలందించారు

 కాలేజీ టైం నుంచి ప్రజా సేవ చేయాలని కోరిక చంద్రబాబుకు ఉండేది. అయితే ముందు ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకున్నారు. రాజకీయాలే సరైనవని నిర్ధారించి విద్యాభ్యాసం పూర్తికాకముందు.. తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం టిడిపి అధినేతగా ఉన్న చంద్రబాబు రాజకీయ ప్రస్థానం హస్తం పార్టీతోనే మొదలైంది. మొదట శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ స్థానిక నేతల కారణంగా తన పోటీని విరమించుకున్నారు.


అయితే 1978లో చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. మొదటిసారి మంత్రి పదవికి కూడా చేపట్టారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక చంద్రబాబుకు ఇదే మొదటి మంత్రి పదవి. తన 28వ ఏటే ఇలా మంత్రి పదవి చేపట్టడం గమనార్హం. ఇలా మంత్రి పదవి చేపట్టిన పిన్న వయస్కుడిగా అప్పట్లో రికార్డు సృష్టించారు చంద్రబాబు. 1980 నుంచి 1983 వరకు సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చంద్రబాబు. చంద్రబాబు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే అప్పటి స్టార్ హీరో నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. దీంతో ఎన్టీఆర్ తన మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి వివాహం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: