చంద్రబాబు.. టిడిపి అభ్యర్థి చేతిలోనే ఓడిన విషయం మీకు తెలుసా?

praveen
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతగా కొనసాగుతున్న చంద్రబాబు రాజకీయ  ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది అన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు టీడీపీలోకి రాకముందే కాంగ్రెస్ లోనే సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఏకంగా మంత్రి హోదాలో కూడా పనిచేశారు. టిడిపిలోకి వచ్చాక తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగారు. విద్యాభ్యాసం సమయం లోనే చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్లో చేరారు ఆయన.

 1978లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు.  అయితే మొదటి ఎన్నికల్లోనే ఆయన విజయం సాధించారు. అంతేకాదు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశారు చంద్రబాబు. కానీ ఆ తర్వాత టిడిపి పార్టీలో చేరారు. నందమూరి తారక రామారావు 1983లో టిడిపి పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల కాలంలోనే ఇక ఆ పార్టీ అఖండ విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.  అయితే ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. అప్పటికే నారా భువనేశ్వరిని పెళ్లి చేసుకున్న చంద్రబాబు.. తన మామ మీద పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ  ప్రకటనలు విడుదల చేయడం సంచలనంగా మారింది. ఆ సమయంలోనే ప్రస్తుతం టిడిపి అధినేతగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు ఇక అదే టిడిపి అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూసారు.


 అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి బరిలోకి దిగిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక తర్వాత కాంగ్రెస్ ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరి ఉన్నత స్థాయికి ఎదిగి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు చంద్రబాబు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున  1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. ఇక 2014 నుంచి 2019 వరకు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించారు. ఇక ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: