మోడీ తొలి సంతకం దానిపైనే.. 9 కోట్ల మంది అకౌంట్లలో డబ్బులు?

praveen
ఇప్పటికే దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ.. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయాన్ని సాధించి మూడోసారి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి మునుపెన్నడు లేని విధంగా పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధిస్తాము అని బిజెపి పార్టీ భారీగానే ఆశలు పెట్టుకోగా.. కొన్ని రాష్ట్రాలలో కమలం పార్టీకి ఊహించని షాక్ లు తగిలాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఇక తమకు సీట్లు తగ్గిన రాష్ట్రాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారట.

 అయితే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత మోడీ వచ్చే 100 రోజుల భవిష్యత్తు కార్యచరణ పై ఉన్నతాధికారులు కేబినెట్ సెక్రటరీ తోను చర్చించినట్లు సమాచారం. అయితే ప్రధాన తొలి సంతకం దేనిపై చేయబోతున్నారు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. కాగా గతానికి భిన్నంగా ప్రధాని మోదీపై ఉత్తరాది రాష్ట్రాల ప్రభావము ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే ఉత్తరాదిన దారుణంగా బిజెపికి సీట్లు తగ్గాయి. ఇక మరికొన్ని రోజుల్లో యూపీ, బీహార్ సహ పలు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ఉన్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తొలి సంతకం దేనిపై చేయబోతున్నారు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి.

 అయితే ప్రధాన నరేంద్ర మోది ఇప్పటికే ఒక కీలక ఫైల్ పై సంతకం చేసేసారట. ఈ క్రమంలోనే 9 కోట్ల మంది ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రధాని మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ ఫైల్ పై చేసినట్లు సమాచారం. పిఎం కిసాన్ నిధి 17వ విడత నిధులు విడుదలకు మార్గం సుగమం అయిందట   దీని కింద దేశవ్యాప్తంగా సీజన్ లోనే 9.30 కోట్ల మంది రైతులకు 20వేల కోట్లు ఆర్థిక సహాయం అందుతుందట. ఇక ఒక్కో రైతుకి ₹2,000 చొప్పున పెట్టుబడి సాయం అకౌంట్లో జమ కాబోతుందట. ఇది ఉత్తరాది రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని ప్రయోగంగా చేశారు అన్నది తెలుస్తుంది. అయితే 2019లో ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం రక్షణ పరికరాల కొనుగోలు పై చేశారు. తద్వారా దేశాన్ని రక్షిస్తున్నామన్న సంకేతాలను ఇచ్చారు. ఇప్పుడు ఇక  తమది రైతుల ప్రభుత్వం అని ఈ మొదటి సంతకం ద్వారా చెప్పకనే చెప్పారు మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: