మోడీకి మద్దతు.. ఎటొచ్చి చిక్కుల్లో పడేది చంద్రబాబేనా?

praveen
కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేపట్టారు  అయితే మోడీ ఈసారి పీఎం అయ్యారంటే బీహార్ సీఎం నితీష్ కుమార్, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చలవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ మోడీకి జై కొట్టారు కాబట్టే పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయగలిగారు. అయితే గెలిచిన తర్వాత కాదు ఎన్నికల నాటి నుంచే వీరు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లారు అన్న విషయం తెలిసిందె. ఎన్నికల్లో ఇక ఘన విజయాన్ని అందుకున్నారు.

 అయితే మోడీకి ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు జై కొట్టడం బాగానే ఉంది. అయితే ఇలా ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రబాబుకు కేంద్రంలో కీలక పదవి దక్కే అవకాశం ఉంది అన్న వార్తలు కూడా తెరమీదకి వస్తున్నాయి  అంతా బాగానే ఉంది కానీ ఇక ఇలా మోడీకి మద్దతుగా నిలిచినందుకు చంద్రబాబుకు మోడీ ఎలాంటి హామీ ఇచ్చారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయిన అంశం. రాజకీయాల్లో ఎప్పుడూ ఒక విషన్ తో ముందుకు సాగే చంద్రబాబు ఎలాంటి షరతులు లేకుండానే మోడీకి మద్దతు పలికాడా.. అలా ఎలా జరుగుతుంది అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది.

 అయితే అటు బాబు అయినా ఇంకోవైపు టిడిపిలో కీలక నాయకుడిగా కొనసాగుతున్న కనకమెడల రవీంద్ర కుమార్ చెప్పిన తాము మోడీ ముందు ఎలాంటి షరతులు పెట్టలేదు అన్నమాట బయటికి వస్తుంది. అయితే ఇప్పుడు ఇదే చంద్రబాబును ఇరకాటంలో పెట్టబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినవి చాలానే ఉన్నాయి  పోలవరం నిధుల దగ్గర నుంచి అమరావతి సొమ్ముల వరకు.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సి ఉంది. మోడీకి మద్దతు ఇస్తున్న చంద్రబాబు కేంద్రం ముందు ఇవే షరతులు పెడతారని అందరూ అనుకున్నారు.

 ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అటు కూటమిలో కీలకంగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి కూడా  ఇదే పాట అందుకునే ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది. ఒకవేళ రెండు రాష్ట్రాలకు ఇస్తే మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కి దెబ్బ పడే అవకాశం ఉంది. దీంతో ఈ విషయాన్ని ముందుగానే లేవనెత్తిన బీజేపీ పెద్దలు ఇలాంటి షరతు పెట్టవద్దని సూచించినట్టు తెలుస్తుంది. ఇక పోలవరం సంగతి అయితే బాబు ప్రస్తావించారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీంతో మోడీకి మద్దతు ప్రకటించిన చంద్రబాబు రానున్న రోజుల్లో చిక్కుల్లో పడే అవకాశం ఉంది అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: