మోడీ సంచలన నిర్ణయం.. ఈటలకు కీలక బాధ్యతలు?

praveen
ఎన్నో రోజుల నుంచి తెలంగాణలో పట్టు సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న బిజెపి పార్టీకి క్రమక్రమంగా బలం పెరుగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో మునిపటితో పోల్చి చూస్తే ఎక్కువ స్థానాలలో విజయం సాధించి సత్తా చాటింది కమలం పార్టీ. అయితే ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సమానంగానే మెజారిటీని దక్కించుకుంది బిజెపి.

 ఏకంగా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలలో సైతం కాషాయ జెండా ఎగరవేయగలిగింది అని చెప్పాలి. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో ఏకంగా ఈటల రాజేందర్ పోటీ చేసి మూడు లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పై ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇలా ఘనవిజయాన్ని అందుకున్న ఈటలకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ నుంచి బండి సంజయ్,  కిషన్ రెడ్డిలకు మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు నరేంద్ర మోడీ.

 అయితే ప్రస్తుతం తెలంగాణ బిజెపిలో కీలక నేతగా.. మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ గా ఉన్న ఈటల రాజేందర్ కు బిజెపి అధిష్టానం కొత్త బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ తెలంగాణ బిజెపి అధ్యక్షుడి బాధ్యతలను ఈటలకు అప్పగించబోతున్నారట. ఈ మేరకు అధిష్టానం నుంచి ఆయనకు సంకేతాలు అందినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ వారంలోనే అటు తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్షుడు ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది  కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో  ఇక రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను ఈటలకు అప్పగించాలని అనుకుంటున్నారట బీజేపీ పెద్దలు. అయితే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఈటెల సరైన ఎంపిక అని బిజెపి శ్రేణులు కూడా అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: