2024 ఎన్నికల్లో నారా లోకేశ్ సక్సెస్ స్ట్రాటజీలివే.. ఆ వారసులకు స్పూర్తిగా నిలిచాడుగా!

Reddy P Rajasekhar
2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ గెలవడం ఇతర పార్టీలకు ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు నారా లోకేశ్ రాజకీయాల్లో గెలవలేదని కామెంట్లు చేసిన వాళ్లు లోకేశ్ సాధించిన మెజారిటీ చూసి నోరెళ్లబెట్టే పరిస్థితి ఏర్పడింది. లోకేశ్ సైలెంట్ గా ఉంటూనే ఇంటర్నల్ వ్యవహారాలను చక్కదిద్ది తాను గెలవడంతో పాటు పార్టీని గెలిపించారు.
 
అధినేతలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో విజయాన్ని నారా లోకేశ్ సొంతం చేసుకున్నారు. ఎవరైతే లోకేశ్ ను తక్కువగా అంచనా వేశారో వాళ్లు ఇప్పుడు లోకేశ్ వ్యూహాలు మామూలుగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ భవిష్యత్తు రథసారథి తానేనని ఈ ఎన్నికల ఫలితాలతో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. మాస్ లీడర్ గా ఎదిగిన లోకేశ్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీ నేతల్లో నమ్మకం సడలిపోకుండా అండగా నిలబడి ధైర్యాన్ని నింపారు.
 
పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కన్నీళ్లు, కష్టాలను చూసిన లోకేశ్ కూటమి అన్ బీటబుల్ రికార్డులకు తాను సైతం పరోక్షంగా కారణమయ్యారు. తన పట్టుదలతో బాబుకు బెయిల్ వచ్చేలా చేయడంతో పాటు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడాల్లేకుండా ఏపీ అంతటా కూటమి హవా కొనసాగేలా చేయడంలో లోకేశ్ సూపర్ సక్సెస్ అయ్యారు. కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల వెనుక కూడా నారా లోకేశ్ స్ట్రాటజీలు ఉన్నాయి.
 
చంద్రబాబు, లోకేశ్ లకు ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో అమరావతికి కొత్త కళ రావడంతో పాటు పూర్వ వైభవం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కూటమి తరపున యువతకు ఎక్కువగా టికెటు కేటాయించేలా లోకేశ్ తీసుకున్న నిర్ణయాలు పార్టీ గెలుపునకు దోహదపడ్డాయి. కూటమి ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకున్న ఎన్నో కీలక నిర్ణయాల్లో లోకేశ్ కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఫీలయ్యే రాజకీయ నేతల వారసులకు సైతం లోకేశ్ స్పూర్తిగా నిలిచారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: