ఏపీలో ఏ కులం నుంచి ఎంత‌మంది ఎమ్మెల్యేలు... ఆ రెండు కులాల హ‌వా ఫుల్‌..!

RAMAKRISHNA S.S.
ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. మొత్తం 175 స్థానాల‌కు గాను వైసీపీ కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితం అయ్యింది. కూట‌మి ఏకంగా 164 సీట్ల‌తో అప్ర‌తిహ‌త విజ‌యం సాధించింది. ఈ సారి ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో ఏ కులం నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. అన్న ఆస‌క్తిక‌ర వివరాలు చూద్దాం. ఈ సారి అసెంబ్లీ ఎన్నికైన వారిలో క‌మ్మ‌, రెడ్ల హ‌వా బాగా ఉంది.

అసెంబ్లీ మొత్తం మీద క‌మ్మ సామాజిక వ‌ర్గం నుంచి ఏకంగా 35 మంది ఎన్నిక‌య్యారు. అయితే గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సామాజిక వ‌ర్గం వారు ఏకంగా 51 మంది ఉండేవారు. ఇక ఇప్పుడు క‌మ్మ‌లు 35 మంది ఉంటే రెడ్లు 32 మంది ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ సామాజికవర్గం నుంచి 29 మంది... ఇక ఈ ఎన్నిక‌ల్లో సెంట‌ర్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్‌గా నిలిచిన కాపు / బలిజ సామాజికవర్గాల నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

ఇక క్ష‌త్రియుల నుంచి 7 గురు, కొప్పు / పొలినాటి వెలమ సామాజికవర్గాల ఎమ్మెల్యేలుగా  7 గురు - ఎస్టీ సామాజిక వ‌ర్గాల నుంచి 7 గురు విజ‌యం సాధించారు. యాదవ సామాజికవర్గం నుంచి 6 - తూర్పు కాపు 5 - గౌడ 4 - బోయ 4 - మత్స్యకార 3 - ముస్లిం 3 - కలింగ 2 - శెట్టిబలిజ 2 - గవర 2 - వైశ్యల నుంచి 2 చొప్పున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక మిగిలిన వారిలో  బ్రాహ్మణ - 1 పద్మనాయక వెలమ - 1 కురుబ - 1 రజక - 1 సూర్య బలిజ - 1 పద్మశాలి / దేవంగ / చేనేత - 01 మరాఠా - 1 ల నుంచి కూడా ఒక్కొక్క‌రు చొప్పున గెలిచారు.

ఇక ధ‌ర్మ‌వ‌రం నుంచి గెలిచిన బీజేపీ స‌త్య‌కుమార్ కులం విష‌యంలో రెండు టాక్‌లు న‌డుస్తున్నాయి. ఆయ‌న యాద‌వ అని కొంద‌రు అటుంటే మ‌రి కొంద‌రు మ‌రాఠా అని చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: