ప్రమాణస్వీకారం చేసిన జే.పీ.నడ్డా.. ప్రత్యేకతలివే..!

Divya
ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.. ఇప్పటికే రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసిన మోడీ ఈ రోజున మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే తన క్యాబినెట్లోకి ఎంతో మంది మంత్రులను కూడా తీసుకోవడం జరిగింది. అలా బిజెపి పార్టీలో అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా మోడీ క్యాబినెట్ లోకి చేరారు ఆయన చేత రాష్ట్రపతి కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన పూర్తి పేరు జగత్ ప్రకాష్ అడ్డా.. ఈయన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్.

ఈయన జననం 1960 డిసెంబర్ రెండవ తేదీన జరిగింది.. ఈయన విద్యాభ్యాసం కూడా న్యాయస్థానంలో పట్టా సాధించారు. మొట్టమొదటిసారిగా 1993లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2021లో రాజ్యసభకు సైతం ఎంపిక కావడం జరిగింది. 2014లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2020లో భాజాపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

2007 నుంచి 2012 వరకు.. 1993 నుంచి 2003 వరకు హిమాచల్ ప్రదేశ్లో విలాస్ పూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయనకు మల్లికా నడ్డాతో 1991 డిసెంబర్ 11 వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నట 2012లో శాసనసభకు తిరిగి ఎన్నికలకు ఎన్నికవ్వగా జాతీయ రాజకీయాలలో ఎదుగుదల లో చాలా కీలకంగా మారింది. బిజెపి పార్టీ ఈసారి మూడవసారి కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో చాలామంది నీ క్యాబినెట్ లోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజున అందరితో కూడా ప్రమాణస్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి  ఇద్దరు టిడిపి నేతలని కాకుండా బిజెపి పార్టీ నుంచి కూడా ఒకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికలలో కూడా బిజెపి పార్టీ నిలబడిన ఎనిమిది నియోజకవర్గాలలో కూడా మంచిని విజయాన్ని అందుకుంది. దీంతో రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ కూడా ఆంధ్రాలో బాగా వేసేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: